అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ ఇవ్వాలి

బీఎస్పీ పార్టీ నాయకులు ఆకేపోగు రాంబాబు

 

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 27 ప్రభుత్వం వృద్దులకు ఆసరా పెన్షన్ ఇస్తూ మరో వైపు కఠీన నియామా నిబంధనలను అమలు చేస్తోందని బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఆకేపోగు రాంబాబు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దువాసిపల్లి గ్రామంలో బీఎస్పీ పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్హులైన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్స్ ను ప్రభుత్వం మంజూరు చేయడం లేదన్నారు. ఆసరా పెన్షన్స్ కోసం నియమ నిబంధనాలను విద్యుస్తూ ప్రజలను మభ్యపెడుతుందని ఆయన విమర్శించారు. మూడు ఎకరాలకుపైగా తడి పొలం, 7.5 ఎకరాలకు పైగా ఆరు బయట పొలాలు ఉన్న వారికి ఆసరా పెన్షన్ పథకాలకు అర్హులు కారని జీవోని రూపొందించడం ఎంతవరకు సమంజసమన్నారు. పంట భూములతో సంబంధం లేకుండా ఆరులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆసరా పెన్షన్ లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పెరపోగు తిరుపాల్, హుస్సేన్ ఆకేపోగు బీసన్న , జమ్మన్న, అయ్యన్న, ఇమ్మానియేలు తదితర గ్రామస్తులు ఉన్నారు.