అలంపూర్ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలి

   మున్సిపల్ చైర్మన్ మనోరమ*                        *అలంపూర్ జనం సాక్షి*(అక్టోబర్ 21)అలంపూర్  పట్టణ అభివృద్ధికి ప్రజలు అందరూ సహకరించాలని, మున్సిపల్  చైర్మన్ మనోరమ అన్నారు. పట్టణ ప్రగతి లో భాగంగా అలంపూర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో గాంధీ చౌకు నుంచి, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గరకు  రోడ్డు విస్తరణ లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులను తొలగించారు. ఈ  సందర్భంగా మున్సిపల్ చైర్మన్  మాట్లాడుతూ అలంపూర్ శాసనసభ్యులు పీఎం అబ్రహం సహకారంతో అలంపూర్  పురపాలక సంఘ అభివృద్ధి కొరకు టియుఎఫ్ఐడిసి నుండి మూడు కోట్ల, యాభై లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ నిధుల నుండి డి వెండర్  ఏర్పాటు చేయడంతో పాటు, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. పురపాలక సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరు, సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ వెంబడి వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి, కమిషనర్ నిత్యానంద్, టౌన్ ప్లానింగ్ కమిషనర్ కురుమయ్య, విద్యుత్ ఏఈ మేఘనాథ్, మేనేజర్ లక్ష్మారెడ్డి, అల్లబకాష్, దేవరాజ్, అదే పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.