అల్ఫోర్స్ లో శ్రావణ శోభ

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) :

శ్రావణ శుక్రవారం రోజు అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో పండుగ శోభ సంతరించుకుంది. అమ్మవారి అనుగ్రహంతో సత్ఫలితాలు కల్గుతాయని , ఆయురారోగ్యాలు సిద్దిస్థాయని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ లో పండుగ వాతావరణం ఉట్టిపడేలా వేధ బ్రాహ్మణుల వేదమంత్రోచ్ఛరణల మధ్య అల్ఫోర్స్ శ్రావణ శోభ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హజరై వారు మాట్లాడారు . ప్రారంభానికి ముందు సాంప్రదాయబద్ధంగా జ్యోతిని వెలిగించి అమ్మవారి ఆశీస్సులు అందరికపై ఉండాలని పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రావణ మాసంలో చాలా మంది పూజలు ఆచరిస్తారని ప్రత్యేకంగా మహిళలు వారి మాంగళ్యాన్ని పరిరక్షించడానికి, కుటుంబ సంరక్షణ పెంపొందించడానికై విశేషంగా పూజలు ఆచారిస్తారని తెలిపారు. శ్రావణ మాసంలో కుటుంబసభ్యులంత కలిసి వారి ప్రేమను ఆప్యాయతను పంచుకుంటు సాముహిక వనభోజనాలకు వెళ్ళడం ఒక గొప్ప అనుభూతినిస్తుందని చెప్పారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం పేరుతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారి అవతారం ప్రతిబింబించేలా పూజా కైంకర్యాలను విశిష్ట సంఖ్యలో వివిధ ప్రదేశాల్లో అత్యంత భక్తి శ్రద్దలతో చేపట్టడడమే కాకుండా పలు పుణ్య కార్యక్రమాలను చేపట్టి ఐశ్వర్యాన్ని పొందుతారని పేర్కొన్నారు. శ్రీ మహాలక్ష్మి మాత కృప ఉన్న వారికి సంపద ఉంటుందని , సకల శుభాలను అందజేస్తుందని వారు తెలిపారు. అన్ని ఆలయాల్లో పచ్చని వాతావరణం మధ్య వివిధ సుగంధ ద్రవ్యాలతో , పండ్ల రసాలతో , పుష్పాలతో , పూజా ద్రవ్యాలతో విశేషంగా ఫలపంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉండే విధంగా పలు సంకీర్తనలు, పారాయణలను చేసి మైమరిపిస్తారని చెప్పారు . వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి వరలక్ష్మీ రావమ్మ , మా ఇంటికి రావమ్మ , మహాలక్ష్మి నమోస్తుతే , నీవే అమ్మ … నీవే వరాలిచ్చే అమ్మ , నృత్యాలు చూపరులను ఆకర్షించాయి . పాఠశాల ప్రాంగణాన్ని పూలతో సుందరంగా అలంకరించి శ్రావణ శోభను రెట్టింపు చేశారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ , ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.