అవకాశం ఇవ్వండి అభివద్ధికి కషి చేస్తా
బీజేపీ అభ్యర్థి కన్నం అంజయ్య..
పెగడపెల్లి,నవంబర్11(జనంసాక్షి): పెగడపెల్లి మండలంలోని రాంభద్రునిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నం అంజయ్య ఇంటింటికి తిరుగుతూ తిరుగుతూ పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజా మాజీ ఎమ్మెల్యే తమ గ్రామంలో చేసిన అభివద్ధి ఏంటని అడిగారు. గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తమ గ్రామానికి తీసుకరవడంలో విఫలమైందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వద్దుల పెన్షన్ 800 రూపాయలు అందిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 200 కలిపి 1000 రూ, చెల్లిస్తున్నదని దీనిని తెరాస ప్రభుత్వం మేము ఇస్తున్నామని చెప్పుకోవడానికి సిగ్గులేదా అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతి ఒక పథకంలో కేంద్ర వాటాను చెప్పుకోకుండా ఇవాళ అన్ని మేము ఇస్తున్నం అని రాజకీయ పబ్బం గడుపుతున్నారని అన్నారు.



