అవకాశం ఉన్న ప్రతి చోటా ఫ్రీడం పార్కుల నిర్మాణం
శ్రీనివాసపురం లక్ష్మికుంట భవిష్యత్ లో రాష్ట్రంలో ప్రముఖ ప్రాంతంగా మారబోతున్నది
రూ.కోటిన్నర వెచ్చించి చిన్న కుంటను పెద్ద చెరువుగా మార్చడం జరిగింది
లక్ష్మికుంట సమీపంలో 35 ఎకరాలలో ఫ్రీడం పార్కు ఏర్పాటు
వనపర్తిలో 11 వేల ఎకరాలలో అటవీప్రాంతం
అటవీప్రాంతాలలో చెరువుల మూలంగా వివిధ రకాల జీవజాతుల పెంపునకు దోహదం పడుతుంది
చెరువులు, కుంటల పునరుద్దరణతో పెరుగుతున్న భూగర్భజలాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలపెట్టిన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో యావన్మంది ప్రజలు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం
భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా వనపర్తి లక్ష్మికుంట వద్ద ఫ్రీడం పార్క్ లో విద్యార్థులు, పట్టణవాసులతో పెద్దఎత్తున మొక్కలు నాటిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి గారు, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా గారు