అవసరార్థులకు చేయూతనివ్వాలి
డీఈవో అబ్దుల్ హై
తొర్రూరు:9 అక్టోబర్ (జనంసాక్షి )
అవసరార్థులకు చేయూతనివ్వాలని డీఈఓ అబ్దుల్ హై అన్నారు.
జిల్లాలోని పలు ఆదర్శ, కస్తూర్బా, గురుకుల పాఠశాలలో వంట కార్మికులుగా పనిచేస్తున్న పలువురికి ధర్మ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ధరావత్ విమల ఆధ్వర్యంలో ఆదివారం డివిజన్ కేంద్రంలో ఆఫ్రాన్లు ఉచితంగా అందజేశారు.
గ్లోబల్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు డాక్టర్ చిరంజీవి, మౌనికల సహకారంతో సమకూర్చిన ఆఫ్రాన్లను ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు విమలతో కలిసి డీఈఓ అబ్దుల్ హై అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
విద్యా సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు తోచిన సాయం అందించడం గర్వకారణమని తెలిపారు. విద్యాసంస్థలు ప్రగతి బాటలో నడవడానికి కార్మికుల తోడ్పాటు ఎనలేనిదని తెలిపారు.
వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు తోడ్పాటు అందించేందుకు స్థానికులు ముందుకు రావాలని కోరారు. ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా సేవా కార్యక్రమాల పరంపర కొనసాగిస్తున్నామని తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని గుర్తు చేశారు. ధర్మ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు విమల సేవా నిరతిని డీఈవో ప్రశంసించారు.
కార్యక్రమంలో ఏసీజీఈ రాములు, జి సి డి ఓ విజయ కుమారి, కస్తూర్బా పాఠశాలల ప్రత్యేక అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
—