అవార్డులు బాధ్యతలను మరింత పెంచుతాయి

– డిఎంహెచ్ఓ డాక్టర్ కోట చలం
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):అవార్డులు బాధ్యతను మరింత పెంచుతాయని డిఎంహెచ్ఓ డాక్టర్ కోట చలం అన్నారు.బుధవారం స్వాతంత్ర్య భారత దినోత్సవ వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ముగింపు కార్యక్రమాలను డిఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందికి జరిగిన ఆటల పోటీల విజేతలకు ఆయన బహుమతులు ప్రధానం చేశారు.జిల్లాలోని వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన ఆరోగ్య సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగాల ఫలం మన స్వాతంత్ర్యమని పేర్కొన్నారు.ఏ రంగంలోనైనా గెలుపోటములు సహజమని, విజేతలుగా ఎల్లప్పుడూ ఒక్కరే ఉండరని అన్నారు.ఉత్తమ అవార్డులు పొందిన వారు మరింత బాగా పని చేసి, ఇతరులకు స్ఫూర్తిగా నిలువాలని అన్నారు.ఉత్తమ అవార్డులు పొందిన జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ వెంకటరమణ, జిల్లా అసంక్రమిత వ్యాధుల అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , టీబీ సూపర్వైజర్ వెంకటేశ్వర్లు ( నడిగూడెం ) , ఫార్మసిస్ట్ కృష్ణ ( కాపుగల్లు) , ల్యాబ్ టెక్నీషియన్ స్వాతి ( రేపాల ), ఆరోగ్య కార్యకర్త శైలజ ( చివ్వేంల ), మల్లిక ( జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి ఆఫీసు) , ఆశా కార్యకర్తలు అరుణ కుమారిలను అభినందించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ హర్షవర్ధన్ , డాక్టర్ వెంకటరమణ , డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరాజు, డిప్యూటీ డెమో అంజయ్య , భూతరాజు సైదులు , క్వాలిటీ మేనేజర్ అరుణ, కృష్ణమూర్తి, విజయ, అన్నమ్మ , విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.