అవినీతి నిరోధక చట్టం కింద శ్రీలక్ష్మి విచారణ
అభియోగాలను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు
13న హాజరుకావాలంటూ శ్రీలక్ష్మికి సమన్లు
జనంసాక్షి, హైదరాబాద్ : ఓఎంపీ కేసులో నిందితురాలైన ఐఏఎస్ అధికారి, పరిశ్రమల శాఖ మాజీ కార్యదర్శి శ్రీలక్ష్మిపౖ అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ నమోదు చేసిన అభియోగాలను సోమవారం సీబీఐ కోర్టు స్వీకరించింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపౖ ఐపీసీతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (2) రెడ్‌విత్ 13 (1) (డి) (నేరపూరిత దుష్ప్రవర్తన) కింద సీబీఐ మోపిన అభియోగాలను సీబీఐ కోర్టు ప్రధాన న్యాయాధికారి యు.దుర్గాప్రసాద్‌రావు విచారణకు స్వీకరిస్తూ ఈ నెల 13న హాజరుకావాలంటూ ఆమెకు సమన్లు జారీ చేశారు. సీబీఐ పంపిన రికార్డులను, వాంగ్మూలాలను, దానిపై శ్రీలక్ష్మి వివరణను తీసుకున్న కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ప్రాసిక్యూషన్‌కు అనుమతించింది. ఈ మేరకు ఆ శాఖ కేంద్ర కార్యదర్శి అనురాగ్‌శర్శ గత ఛార్జిషీటులో శ్రీలక్ష్మిపై అవినీతి నిరోధక చట్టం కింద ఉన్న అభియోగాలను విచారణకు స్వీకరించాలంటూ కుంద్ర అనుమతి నోట్ తోపాటు సీబీఐ ఈ నెల 6న మెమో దాఖలు చేసింది. ఈ మెమోను పిరిశీలించిన సీబీఐ కోర్టు సోమవారం విచారణకు స్వీకరిస్తూ శ్రీలక్ష్మికి సమన్లు జారీ చేసింది.