అసమర్థులను అసెంబ్లీకి పంపితే బహుజనుల బతుకులుఎప్పటికీ మారవు

బిఎస్పీజిల్లాఇన్చార్జి కేశవ్ అలంపూర్ జూలై29(జనం సాక్షి)

బహుజనుల బతుకులుమారాలంటే అసమర్థనాయకులను అసెంబ్లీకిపంపితే మారవు, అది బహుజనసమాజ్ పార్టీ ద్వారానేసాధ్యమని జోగులాంబగద్వాల్ జిల్లాబిఎస్పి అధ్యక్షుడు కేశవ్ అన్నారు. శుక్రవారం బహుజన సమాజ్ పార్టీనాయకులు మండలంలోని సుల్తానాపురం గ్రామంలోపర్యటించారు.ఈ సందర్భంగాజిల్లానాయకులు కేశవ్ మాట్లాడుతూ గ్రామానికి వచ్చే రోడ్ల పరిస్థితిచాలా దారుణంగా ఉంది, ప్రజాప్రతినిధులకు ఈ గ్రామ ప్రజల ఓట్లు కావాలి కానీ వీళ్ళకు రోడ్ల అవసరం లేదా అని ప్రశ్నించారు. చాలా దారుణమైన రోడ్లమీద వీరు ప్రయాణం చేయాల్సి వస్తున్నందుకు ఇక్కడి ప్రజాప్రతినిధులు సిగ్గుపడాలన్నారు. గ్రామం నుంచిగర్భిణీ స్త్రీలు అలంపూర్ కువెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొని ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు ఓట్లు వేయించుకుంటున్నారుకానీ రోడ్లువేయడంమరచి పోయారుఅన్నారు.అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు అబ్రహంకు ప్రజలకష్టాలు పట్టవాఅనిప్రశ్నిచారు.ఈ గ్రామంలోనిప్రజలఓట్లు వేయించుకున్నావుకదా మరి వీళ్ళకురోడ్లువేసేఅవసరం లేదనుకున్నావాఅన్నారు.గ్రామ ప్రజలు ప్రయాణానికి అవస్థలు పడే పరిస్థితుల్లో ఉన్నా కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి ప్రజాప్రతినిధులకురాబోయే రోజులలో బహుజన సమాజ్ పార్టీతరఫునబుద్ధి ప్రజలే బుద్ది చెబుతారు మన్నారు.
అలంపూర్ నియోజకవర్గం లో సబహుజన సమాజ్ పార్టీ తరఫున నీలి జెండా ఎగురవేసి పల్లెలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి ముందడుగు అలంపూర్ నుంచే వేస్తున్నామన్నారు. ప్రజలు సైతం ఇటువంటి అసమర్థులకు అవకాశం ఇవ్వకుండా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అవకాశం ఇచ్చి ఏనుగు గుర్తుకు ఓటెయ్యాలన్నారు.
అలంపూర్ నియోజకవర్గం అధ్యక్షులు బి మహేష్,
ఉపాధ్యక్షులు యమని. సుంకన్న, మండలం బహుజన నాయకులు రవి, ఎల్లయ్య, మద్దిలేటి పాల్గొన్నారు.