అసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన శాసన సభ్యులు. జజల సురేందర్
ముఖ్యమంత్రి. కె సి ఆర్ చిత్ర పటానికి పాలభి షేకం చేసిన మహిళలు
ఎల్లారెడ్డి 26 ఆగస్ట్ జనం సాక్షి. ఎల్లారెడ్డి మండలం లోని తిమ్మారెడ్డి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా అందిస్తున్న నూతన ఆసరా పెన్షన్లను ఎల్లారెడ్డి శాసన సభ్యులు .జాజాల సురేందర్ లబ్ధిదారులకు పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు.అనంతరం గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి లబ్దిదారులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్ల మడుగు మాట్లాడుతూ…. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించబడుతున్నాయి. రైతులకు పెట్టుబడి సాయంగా రైతు బంధు, దురదృష్ట వశాత్తూ మరణిస్తే రైతు బీమా అందించబడుతున్నాయన్నారు.రాష్ట్ రంలోని దళిత కుటుంబాలకు దళిత బంధు ద్వారా ఆర్థిక స్వయం సమృద్ధి, సంపద సృష్టించబడుతున్నది.అదేవిధంగా కల్యాణలక్ష్మి, షాది ముభారక్ పథకాల ద్వారా పేద కుటుంబాలకు నగదు సహాయం అందించబడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. పుట్ట బోయే బిడ్డ నుండి వృద్ధుల వరకు సంక్షేమం అందిస్తున్న ఏకైక రాష్ట్రం కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం అని తెలిపారు.రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వ గురుకుల విద్యాలయాలలో,ప్రభుత్వ వసతి గృహాల్లో సన్న బియ్యంతో పాటు పౌష్ఠిక మైన ఆహారం అందిస్తూ మంచి విద్య అందించబడుతుంది అని అన్నారు.రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు కరెంటు కోసం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడైతే నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకు అందించబడుతుంది.రాష్ట్రం లోని ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు,డంపింగ్ యార్డులు,ట్రాక్టర్లు సౌకర్యం ఇవన్నీ కెసిఆర్ గారి నాయకత్వములో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చినవే అని, గత ప్రభుత్వాలు,నాయకులు గ్రామాల అభివృద్ధి గురించి ఎన్నడూ ఆలోచించలేదని అన్నారు.నియోజకవర్గ ప్రజా సమస్యల పట్ల పూర్తిగా అవగాహన వున్నందున నియోజకవర్గ కేంద్రం అయిన ఎల్లారెడ్డి పట్టణంలో రూ.1500.00 కోట్లతో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని,డయాలసిస్ కేంద్రం అవసరమని సిఎం ని, మంత్రి ని కలిసి వివరించి పరిపాలన,నిధుల అనుమతులను పొందడం జరిగింది.గత 40 ఏండ్లు గా ఎల్లారెడ్డి చెరువు కట్టపై రోడ్డు,బ్రిడ్జి నిర్మాణం గురించి ఏ నాయకుడికి పట్టని పనిని అతి కొద్ది రోజుల్లోనే పూర్తి చేసి చూపించడం జరిగింది. ఇలా కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో జరుగుతున్నాయని, వాటి గురించి ప్రజలు ఆలోచించాలని అన్నారు. ప్రజల మధ్య కులాలు, మతాల చిచ్చు పెట్టే పార్టీలు,నాయకుల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు.ఈరోజు పెన్షన్ అందుకుంటున్న లబ్ధిదారులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్, సత్యనారాయణ ఎంపిపి, మదవి .గౌడ్ జెడ్పీటీసీ ఉష గౌడ్ ,ఎంపిటిసిలు సంతోష్ ఉమ దేవి ,సర్పంచులు,పి ఎ సి ఎస్ చైర్మలు, ఎగుల నర్సింలు పటేల్ సాయిలు డైరెక్టర్స్,మునిసిపల్ కౌన్సిలర్స్,వార్డ్ మెంబర్లు,అధికారులు, మండల,గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.