అసెంబ్లీ ఎన్నికల విధులలో అప్రమత్తంగా ఉండాలి
అసెంబ్లీ ఎన్నికల విధులలో అప్రమత్తంగా ఉండాలి
తుంగతుర్తి అక్టోబర్ 27 (జనం సాక్షి)
ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో ప్రోసిడింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి యాదగిరి రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో మాస్టర్ ట్రైనర్లతో ప్రిసీడింగ్ అధికారులు సెక్టోరియల్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సెక్టోరియల్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్లు యూనిట్ కంట్రోల్ పివి ప్లాట్లను పోలింగ్ కేంద్రాల్లో అమర్చడం మాకు పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రెసిడెంట్ ఆఫీసర్లకు ఇచ్చే హ్యాండ్ బుక్ లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివి తెలుసుకోవాలని అన్నారు ఎన్నికల రోజు సిబ్బందికి తగు సూచనలు చేయాలన్నారు ఎన్నికల ముందు రోజు సామాగ్రి పంపిణీ సిబ్బంది తరలింపు తదితర వాటిపై తాసిల్దారులు పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకొని ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా కృషి చేయాలన్నారు ఏమైనా సందేహాలు ఉంటే పై అధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు ఎన్నికల ముందు రోజే పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలని ఉదయం 5:30 గంటల నుండి పోలింగ్ నిర్వహించాలన్నారు. కంట్రోల్ యూనిట్ ద్వారా ఉదయం ఏడు గంటలకు పోలింగ్ నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం ఎన్నికలను నిర్వహించాలన్నారు శిక్షణ పొందిన రోజు నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రొసీడింగ్ అధికారులకు తగు సూచనలు ఇచ్చారు ఈ మేరకు ప్రొసీడింగ్ అధికారులకు ఫామ్ 12 ఫారం ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ సమావేశంలో వివిధ మండలాల తాసిల్దార్లు డిటి హరిచంద్ర ప్రసాద్ తో పాటు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు