అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలి
దంతాలపల్లి: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తీర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ తెరాస ఆధ్వర్యంలో నర్సింహుల పేట మండలం వంతాడపూల స్టేజీ వద్ద సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. తెలంగాణ ఏర్పాటుపై అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షుడు ఎండీ కాజామియాతో పాటు తెరాస నేతలు పాల్గొన్నారు.