* అసైన్డ్ భూమి ఉష్కాకేనా…?
* పరిరక్షించాల్సిన రెవెన్యూ యంత్రం ప్రలోభాలకు గురవుతోందా…?
* మున్సిపల్ అధికార పాలకవర్గమే పావులు కదుపుతోందా…?
* అధికారుల అండదండలతోనే అక్రమార్కులు పెట్రేగిపోతున్నారా…?
* అధికార యంత్రాంగం విధి నిర్వహణలో ఉందా…?
* కలెక్టర్ స్పందించి అసైన్డ్ భూమిని కాపాడాలని స్థానికుల విజ్ఞప్తి
*ఒక పురపాలక సంస్థ కార్యాలయం అంటే ఈ పురపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రజలందరికీ ఇది ఒక దేవాలయం ప్రజా సమస్యలు పరిష్కరించేందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారులతో పాటు ప్రజల సమస్యలతో పాటు పురపాలక ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తారని ఎలాంటి అక్రమాలకు తావివ్వబోరని నమ్మకంతో తెలివి గల వారిని డివిజన్ల వారిగా ఎన్నుకోబడ్డ పాలకమండలి సభ్యులు ప్రజలందరూ దేవాలయంగా భావించే ఈ పురపాలక సంస్థ కార్యాలయంలో ఉంటారు కానీ బ్రాహ్మణులందరూ ఉన్నచోటనే రొయ్యల ముల్లెలు ఎలా మాయమయ్యాయి అన్న శాస్త్రం లాగా ఈ పురపాలక సంస్థ కార్యాలయంలో అసైన్డ్ భూమి కబ్జా వ్యవహారం చిలికి గాలివానగా మారుతుంది ఈ ఈ కబ్జా తతంగం అంతా ఎక్కడ జరుగుతుందని సందిగ్ధ పడుతున్నారా అయితే పూర్తి వివరాల్లోకి వెళ్దాం*
కీసర ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ) ఆగస్టు 10 :- అధికారులతో పాటు ఎలాంటి అక్రమాలకు తావివ్వబోరని ప్రజలు నమ్మకంతో ఎన్నుకున్నటువంటి పాలకమండలి సభ్యులు ఇందరు ఉన్నప్పటికీ అసైన్డ్ భూమి కబ్జాకు గురి కావడంలో ఆంతర్యం ఏమిటనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శిల్ప నగర్ ప్రాంతంలో గల 206 సర్వే నెంబర్ కు చెందిన అసైన్డ్ భూమి కబ్జాకు గురైందని ఈ అసైన్డ్ భూమిని అధికారులు పరిరక్షించాలని స్థానికులు అభ్యర్థించడం జరిగిందనీ తెలిపారు అయినప్పటికీ నేటి వరకు ఈ అసైన్డ్ భూమి వైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం నాగారం పురపాలక ప్రాంతం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని చెప్పుకునే అధికారులు పాలకమండలి సభ్యులు కొందరు అక్రమార్కులు గుట్టు చప్పుడు కాకుండా అసైన్డ్ భూమిని కబ్జా చేసి రిజిస్ట్రేషన్ స్థలంలో నిర్మాణాలు చేసిన విధంగా దర్జాగా 18 అక్రమ నిర్మాణాలు చేపట్టినప్పటికీ నిమ్మకు నీరెత్తిరెట్లు వ్యవహరించడం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడం కాదా…? అని స్థానికులు నిలదీస్తున్నారు పురపాలక ప్రాంతం అభివృద్ధిలో భాగంగా ఈ అసైన్డ్ భూమిని పరిరక్షించి ప్రజా అవసరాల కోసం వినియోగించి అభివృద్ధిని చాటుకోవాల్సిన బాధ్యత వీరిపై లేదా…? అని ప్రశ్నిస్తున్నారు అధికారులు పాలకమండలి సభ్యులు అక్రమార్కులతో కుమ్మక్కై ప్రజా అవసరాల కోసం వినియోగకరంగా ఉన్న కోట్ల విలువ చేసే ఈ సైడ్ భూమిని పంచ గద్దల పలహారం చేసేందుకు కంకణ బద్దులయ్యారా… అనే అనేకమైన అనుమానాలు ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ యంత్రాంగం సైతం ఈ అసైన్డ్ భూమిని పరిరక్షించడంలో విఫలం అవ్వడానికి గల కారణాలు ఏమిటో అర్థం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు ఇదంతా చూస్తుంటే గతంలో కీసర మండల తహసిల్దార్ నాగరాజు ప్రభుత్వం ఇచ్చే జీతాల కన్నా అక్రమ సంపాదనకు ఆసక్తి చూపి దుర్బుద్ధికి లోనై విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన విధంగానే నేటి రెవెన్యూ యంత్రాంగం కూడా ముడుపుల కోసం ముచ్చటపడుతు విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతు ఎంతో విలువైన ఈ అసైన్డ్ భూమిని పరిరక్షించేందుకు సుముఖత చూపడం లేదా అనే అనుమానాలు అధికమవుతున్నాయి ఏలాంటి అనుమానాలకు తావు లేనియెడల ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా గతంలో పలుమార్లు నామమాత్రపు కూల్చివేతలతో సర్దుకోవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని నేడు రెవెన్యూ యంత్రాంగం పరిరక్షించాల్సిన ఈ అసైన్డ్ భూమి 18 నిర్మాణాలతో దర్శనమిస్తున్న వైనం అధికారులు విధి నిర్వహణలో అధికార దుర్విని పాల్పడుతున్నారని అనడానికి ఈ అసైన్డ్ భూమిలో వెలిసిన 18 నిర్మాణాలు నిలువెత్తు నిదర్శనాలు కాదా…? అనే నిలదీతలు అధికమవుతున్నాయి
*స్థానికుల ధ్వజం*
పోలీస్ బందోబస్తు పేరుతో కాలయాపన చేయకుండా ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం విధి నిర్వహణలో నిర్లక్ష్య ధోరణి అవలంబించకుండా బాధ్యతాయుతంగా ఈ అసైన్డ్ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను పూర్తిస్థాయిలో తొలగించి ప్రజా అవసరాల కోసం వినియోగించేలా భూమిని పరిరక్షించని ఎడల ఈ అసైన్డ్ భూమి కబ్జా వ్యవహారాన్ని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ప్రజా దర్బార్ ద్వారా జిల్లా కలెక్టర్ తో పాటు కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావుల దృష్టికి కూడా తీసుకు వెళ్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు