అసైన్డ్ భూములకు పట్టా హక్కులు కల్పిస్తాం

నర్సాపూర్. నవంబర్ 16 (జనం సాక్షి )
కాంగ్రెస్ బిజెపి నాయకులు చెప్పే మాటలు నమ్మొద్దని వారు మాటలు నమ్మితే మోసపోతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం నర్సాపూర్ వెల్దుర్తి రూట్లో బి అర్ ఎస్ ఆశీర్వాద సభ బి ఆర్ ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి తదితరులు అజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఎన్నికలు మీ తలరాతలు మారుస్తాయని ఎన్నికల సమయంలో ఆగమాగం కావద్దని అభ్యర్థుల గుణ గణాలు, పార్టీల చరిత్ర కూడా చూడాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో మనలో తీవ్రంగా ఘోష పెట్టిందని, ఎరువుల కోసం విత్తనాల కోసం కరెంటు కోసం ప్రతి విషయంలో మనం తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ను గెలిపిస్తే ఆ పార్టీ జాతీయ నాయకుడు ధరణిని బంగాళాఖాతంలో పడేస్తాడని అన్నారు. ధరణి పోతే మళ్ళీ తిరిగి పాత రోజులే వస్తాయని వీఆర్వోలు అధికారులు లంచాలు పట్టిపీడిస్తారని అన్నారు. ప్రభుత్వ పథకాలు కొనసాగాలంటే తిరిగి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి గెలిపించాలని కోరారు. అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ వాళ్లు మొనగాళ్లు అని వాళ్ల మాటలు విని మోసపోవద్దని అన్నారు. రేవంత్ రెడ్డికి ఓటుతో గుణపాఠం చెప్పాలని సూచించారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే పరం పోగు భూములు గుంజుకుంటామని చేస్తున్న విషప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని సూచించారు. ప్రస్తుతం హామీలు ఇస్తున్న పార్టీలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చూశారో గమనించాలని కోరారు. రాష్ట్ర సాధన కోసమే బీ అర్ ఎస్ పుట్టిందని అన్నారు. బీ ఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో కరెంట్, నీళ్లు లేవని, కానీ ఈ పదేళ్లలో బీ అర్ ఎస్ ఎలాంటి అభివృద్ధి చేసిందో ప్రజలకు అంతా తెలుసు అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న రైతు బంధు ను 16 వేలకు పెంచుతున్నమని ప్రకటించారు. వ్యవసాయానికి మూడు గంటలు కరెంట్ చాలని, 24 గంటలు వేస్ట్ అని పీసీసీ అధ్యక్షుడు చెబుతున్నాడని అన్నారు. మూడు గంటల వస్తె 10 హెచ్ పీ మోటార్ లు పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారనీ అన్నారు. రైతులు అంత ఖర్చు చేసి ఎక్కడ మోటార్ లు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. ధరణి తీసేస్తే రైతు బంధు, రైతు భీమా పథకాలు బంద్ అవుతాయని అన్నారు. ధరణి తీసేస్తే మళ్ళీ దళారుల రాజ్యం వస్తుందని, గతంలో ఎదుర్కొన్న వీ అర్ వో లు, ఇతర దళారులు, పైరవీ కారుల వ్యవస్థ వల్ల పాత ఇబ్బందులు వస్తాయని చెప్పారు.
సీఎం కేసీఆర్ సమక్షంలో బీ ఆర్ఎస్ పార్టీలో చేరిన గాలి అనిల్ కుమార్
ప్రజా ఆశీర్వాద సభకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి గాలి అనిల్ కుమార్, మెదక్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మ్యాడం బాలకృష్ణ, నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయపల్లి గోపి, బిజెపి రాష్ట్ర నాయకుడు గడిల శ్రీకాంత్ గౌడ్, రాజేశ్వరరావు దేశ్ పాండే, కౌన్సిలర్ సునీత బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింగ్ రావు అజ్మత్ తదితరులు కేసిఆర్ సమక్షంలో బీ ఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, జెడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు అశోక్ గౌడ్, జగదీష్, పైడి శ్రీధర్ గుప్తా, ల కవత్ రమేష్ నాయక్, జడ్పిటిసిలు మేఘమాల, ఆంజనేయులు, పబ్బ మహేష్ గుప్తా, మన్సూర్ తదితరులు ఉన్నారు.