**ఆందుల పాఠశాలలో
ఘనంగా జన్మదిన వేడుకలు**
గద్వాల ఆర్ సి, సెప్టెంబర్ 1 (జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు
రాజీవ్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా,జోగులాంబ గద్వాల పట్టణంలోని తన నివాసం వద్ద మర్యాద పూర్వకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం బ్లైండ్ స్కూల్ లో అనాధ పిల్లలతో కేక్ కటింగ్ చేసి వారిని తినిపించడం జరిగింది. పిల్లలకు పండ్లను పంపిణీ చేసి వారి యొక్క సమస్యలను తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపాల్ రంగన్న ,సిబ్బంది తో స్కూల్ యొక్క బాగుగుల గురించి,అన్ని విధాలుగా తెలుసుకున్నారు.అనాధ పిల్లల కోసం ఆర్థికంగా ఎల్లప్పుడూ సహాయ సౌకర్యాలతో ఉంటానని విలేకరుల సమావేశంలో చెప్పారు.పై చదువులు చదివి అందరికీ ఆదర్శం కావాలిని తెలిపారు.ఈ కార్యక్రమానికి పట్టణ యువజన కాంగ్రెస్ పార్టీ
గద్వాల అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ మహేందర్, వనపర్తి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు
దివాకర్ మీడియా ఇంఛార్జి సతీష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.