ఆంధ్రాకు పెద్దపొట్లం

1

అరుణ్‌ జైట్లీ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖా మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు.  ప్యాకేజీ ప్రకటనపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని, దీనిపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. వీలైనంత తొందరగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక ¬దా వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ ప్యాకేజీలో పొందుపరుస్తామని ఈ సందర్భంగా జైట్లీ హావిూ ఇచ్చారు. ప్రత్యేక ¬దా లేని రాష్ట్రాలు  భరించే 30శాతం నిధులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రత్యేక¬దాపై తమ వైఖరిని రాజ్యసభలో చెప్పామని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ అన్నారు. దీనిపై అరుణ్‌ జైట్లీ, వెంకయ్య నాయుడు స్పష్టంగా చెప్పారన్నారు. ప్రత్యేక¬దాపై చర్చలు జరుగుతున్నాయన్న కేంద్రమంత్రి విభజన హావిూలు తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక ¬దా, ప్యాకేజీ అంశాలపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఏపీకి ప్రత్యేక ¬దాకు బదులు ప్యాకేజీ కేంద్రం ప్రకటించనున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరుపుతోంది. ఒక్కొక్క అంశంపై ఆర్థిక, ¬ంశాఖ అధికారులతో సుజనాచౌదరి, సీఎం రమేష్‌లతో కూడిన బృందం విడతల వారీగా చర్చిస్తోంది. రెవెన్యూ లోటు భర్తీపై చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొన్నట్లు సమాచారం. మరోవైపు దిల్లీలో జరుగుతున్న చర్చలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో చర్చిస్తున్నారు. విశాఖకు రైల్వేజోన్‌ ఇవ్వకపోతే ఆర్థికంగా నష్టపోతామని.. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ రైల్వేజోన్‌ ప్రకటించాల్సిందేనని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు మొత్తం 9 అంశాలపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని ఏపీ కోరుతోంది. ఇకపోతే ఏపీకి ప్రత్యేక సాయంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ప్రకటన చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు లేకుండా ప్రకటన చేస్తే ఇబ్బందులు వస్తాయనే ఆలోచనలో ఉంది. మరోవైపు ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటనపై కేబినెట్‌ ఆమోదం అవసరమవుతుంది కాబట్టి, కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటన చేయాలా అన్నవిషయంలో మల్లగుల్లాలు పడుతోంది. ఒక వేళ ¬దాపై ప్రకటన చేయాల్సి వస్తే గతంలో మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్‌ దీనిని ఆమోదించిన నేపథ్యంలో ఇప్పుడు స్టేట్‌మెంట్‌ ఇస్తే సరిపోతుందనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. కాగా ఏపీకి ప్రత్యేక సాయంపై ఆశించిన విధంగా కేంద్రం నుంచి సానుకూల ప్రకటన వస్తుందంటే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది. అంతకుముందు ఏపీకి ¬దాపై చర్చించేందుకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్‌ భేటీ అయ్యారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇస్తారా లేదా అన్నది పక్కనపెడితే ఎపికి ఇచ్చే ప్యాకేజీకి సంబంధించి కసరత్తు ముమ్మరం చేశారు. మరోమారు కేంద్రం ఈ విషయంలో హడావిడి చేస్తోంది. అయితే దీనిపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని కేంద్రమంత్రి సుజనాచౌదరి స్పష్టం చేశారు. ¬దా అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. బుధవారం  ఉదయం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌తో కలిసి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్యనాయుడులతో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ.. ¬దాపై జాతీయ అభివృద్ధి మండలికి పంపించి నిర్ణయం అంటే చాలా సమయం పడుతోందని.. అందువల్ల దీనిపై నేరుగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఇరు రాష్ట్రాల  సమస్యల పరిష్కారానికి ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నియోజకవర్గాల పెంపుపై కూడా కేంద్రంతో చర్చించినట్లు సీఎం రమేష్‌ తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.రాష్ట్ర విభజన హావిూలపై వెంకయ్య నాయుడుతో చర్చించినట్లు తెలిపారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెబుతోందని, సాయంత్రానికి ఓ స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. చట్టపరంగా ఉన్న అంశాలపై చర్చ జరుగుతోందన్నారు. వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హావిూలు, రాష్ట్ర విభజన నాడు ఇచ్చిన వాగ్దానాల సంకలనంగా కేంద్రం రూపొందించిన ఆర్థిక ప్యాకేజీపై  ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర వర్గాలు తెలిపాయి. మరోవైపు కేంద్రం నుంచి ఎటువంటి సందేశం వస్తుందా అని సిఎం చంద్రబాబు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రానికి  ఆర్థిక ప్యాకేజీ గురించి దిల్లీ నుంచి అందుతున్న సంకేతాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులతో తన కార్యాలయంలో సమావేశమయ్యారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, పుల్లారావు, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రత్యేక ¬దాతో ఒనగూరే ప్రయోజనాలకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో ప్యాకేజీ ఉంటుందని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి దీనిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్యాకేజీ సంతృప్తికరంగా లేకపోతే ఎలా స్పందించాలన్న దానిపైనా చర్చించిట్లు సమాచారం. ఇకపోతేఏపీకి ప్రత్యేక ¬దా విషయంలో కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబును వెంటనే ఢిల్లీకి రావాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఫోన్‌ చేశారు. ఈ పరిణామాలతో విజయవాడలో రాజకీయం వేడెక్కింది. ¬దాకు సంబంధించి చంద్రబాబు 8 డిమాండ్లను కేంద్రం ముందు ఉంచారు. ఆ డిమాండ్లన్నింటినీ అంగీకరించి, డ్రాప్ట్‌లో పొందుపరిస్తేనే తాను ఢిల్లీకి వస్తానని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు సూచించిన డిమాండ్లలో పరిశ్రమలకు రాయితీల విషయంలో కేంద్రం విముఖంగా ఉన్నట్లు సమాచారం. విశాఖ రైల్వే జోన్‌ ప్రకటించాలని చంద్రబాబు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ¬దాకు, ప్రత్యేక ప్యాకేజికి నిధుల విషయంలో 30 శాతం తేడా ఉందని, ఆ లోటును భర్తీ చేస్తేనే ప్యాకేజికి అంగీకరిస్తామని బాబు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కేంద్రం చంద్రబాబుకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక ప్రత్యేక నిధిని సృష్టించి రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తామని కేంద్రం తెలిపింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. మరోవైపు విశాఖకు రైల్వేజోన్‌ లేదనడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రైల్వే మంత్రి సురేష్‌ప్రభుతో ఫోన్‌లో చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికల ముందు అందరం కలిసి మాటిచ్చామని ఆయన కేంద్రమంత్రికి గుర్తుచేశారు. వేరే రాష్ట్రాలు  అభ్యంతరం చెబితే రైల్వేజోన్‌ను ఎలా మారుస్తారని ఆయన కేంద్రమంత్రిని ప్రశ్నించారు.  ప్రత్యేక ¬దాపై కేంద్రం ప్రకటన చేయనున్న నేపథ్యంలో తాజా పరిణామాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నారు. బుధవారం వెలగపూడిలో పర్యటించాల్సి ఉండగా… దాన్ని రద్దు చేసుకుని తన నివాసంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.  కేంద్రం ప్రకటించే ప్యాకేజీ ప్రతిపాదనలపై ఈ సందర్బంగా చర్చించారు.