ఆంధ్రాకు ప్రత్యేక హోదా దిశగా అడుగులు

1

న్యూఢిల్లీ,ఆగస్టు 31(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దాపై కేంద్రంలో శరవేగంగా అడుగులు పడుతున్నాయి. గత రెండు రోజులుగా వరుస భేటీలు జరగుతున్నాయి. తాజాగా ప్రధాని సమక్షంలో దీనిపై చర్చ జరగడంతో మళ్లీ దీనిపై ఆశలు చిగురించాయి. ప్రత్యేక ¬దా  ఇవ్వాలా? లేదా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలా? అన్న సందిగ్ధతకు వారం రోజుల్లో తెరపడనున్నట్లు సమాచారం. కేంద్రమంత్రులు అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడు.. భాజపా అధ్యక్షుడు అమిత్‌షాతో బుధవారం  మరోసారి భేటీ అయి ఈ అంశంపై చర్చించారు. ఈనెల 9న పవన్‌ కళ్యాణ్‌ కాకినాడ సబకుముందే ఓ నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం. ఉదయం మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత వెంకయ్యనాయుడు ప్రధాని మోదీని కలిసి దీనిపై చర్చించారు. పార్టీ పరంగా ఏపీకి ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని వెంకయ్యనాయుడు వారికి సూచించినట్లు తెలుస్తోంది.  ఏపీకి ప్రత్యేక ¬దాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో బుధవారం కీలక చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ¬దాపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపీకి విభజన చట్టంలో ఉన్న అంశాలు, ఇప్పటి వరకు అమలు చేసినవి, వాటికి సంబంధించిన అంశాలు, 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన సిఫార్సులు, వీటన్నిటితోపాటు ఏపీ ప్రజలకు ఇచ్చిన హావిూలపై ఒక నిర్ధిష్టమైన ప్రణాళికను అందజేయాల్సిన అవసరం ఉందని, పోలవరం, రాజధాని నిర్మాణానికి సంబంధించి నిధులపై కూడా స్పష్టత ఇస్తే బాగుంటుందని, దానికి సంబంధించి ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని వెంకయ్యనాయుడు ప్రధాని మోదీకి వివరించినట్లుగా సమాచారం. గత రెండు రోజులుగా జైట్లీ, అమిత్‌ షా నేతృత్వంలో ¬దా, ప్యాకేజీలపై సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరి నిన్న జైట్లీని కలిసి ఐదు పేజీల ముసాయిదా అందజేశారు. బుధవారం మోదీ, జైట్లీ, వెంకయ్య, అమిత్‌ షా ఈ నలుగురూ కీలకమైన చర్చలు జరిపారు. ఇక అధికారుల స్థాయిలో లెక్కలు తేలాల్సి ఉంది. వెంకయ్య నాయుడు చెప్పిన విషయాలు విన్న మోదీ ఏపీ ప్రజలకు ఇచ్చిన హావిూలపై సంతృప్తి కలిగే విధంగా నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు సమాచారం. మొత్తంగా ప్రత్యేక ¬దా, ప్యాకేజీలకు సంబంధించి బుధవారం జరిగిన చర్చలే తుది చర్చలని ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు ద్వారా తెలియవచ్చింది. ఏపీ బీజేపీ నేతల సలహాలను, సీఎం చంద్రబాబు సూచనలను వెంకయ్య ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాలపై మోదీ సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక ¬దా, ప్యాకేజీలపై త్వరలోనే అధికారులు తుది లెక్కలు తేల్చనున్నారు. మొత్తానికి  ప్రజలకిచ్చిన హావిూలపై సంతృప్తి కలిగించే విధంగా త్వరలో ప్రధాని మోదీ శుభవార్త తెలపనున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఏపీకి హావిూలు నెరవేర్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. గత రెండు రోజుల్నుంచి ప్రత్యేక ¬దాపై వరుస భేటీలతో కేంద్ర మంత్రులు బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు ఏపీ సీఎం చంద్రబాబుతో బీజేపీ పెద్దలు సంప్రదించగా సీఎం మాత్రం ప్రత్యేక ¬దా ఇవ్వాల్సిందేనంటూ పట్టుపట్టినట్లు విశ్వసనీయ సమాచారం.