-ఆకట్టుకున్న కవి సమ్మేళనం.

-రాష్ట్ర సాధనలో కవులది కీలక పాత్ర.
-దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన కవి సమ్మేళనం.
-అదనపు కలెక్టర్ యస్. మోతిలాల్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 16(జనంసాక్షి):
స్వాతంత్ర్య భారత 75వ వజ్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం స్థానిక సహకార సంఘం భవనంలో జరిగిన కవి సమ్మేళనం ఎంతగానో ఆకట్టుకుంది.ఈ కవి సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ యస్.మోతిలాల్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర సాధనలో కవులది కీలక పాత్ర అని అన్నారు.స్వతంత్ర భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా కవి సమ్మేళనం కార్యక్రమం జరిగిందని అన్నారు.స్వాతంత్ర్య సాధనను ఎలా సాధించింది కవితల ద్వారా చెప్పవచ్చునని ఆయన తెలిపారు.భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను 2 వారాలపాటు వేడుకలు జరుపుకుంటున్నామన్నారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వ హించుకుంటున్నామన్నారు.అందులో భాగంగా జాతీయ జెండా, జాతీయ గీతం, స్వతంత్ర పోరాటం, దేశభక్తి, దేశ గొప్పతనం వంటి అంశాలపై కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహించామని, ఇందులో కవులు స్వచ్చంధంగా పాల్గొన్నారన్నారు.బ్రిటీష్ వారి నుండి స్వాతంత్ర్య సముపార్జనకు ఎంతోమంది సమరయోధులుపాల్గొన్నారని, వారందరిని కవి సమ్మేళనంలో 42 మంది కవులు తమ కవిత్వంలో చాలా ఆనందాన్ని ఉత్తేజాన్ని కలిగించారని అన్నారు.అదనపు కలెక్టర్ మోతిలాల్ తన మాటలతో కాకుండా కవితతో కవులను పేరుపేరునా వారి కవితలతో అభివర్ణించారు.అదనపు కలెక్టర్ అభివర్ణను కవులు ఆనందాన్ని వ్యక్త పరిచారు.జిల్లా పౌర సంబంధాల అధికారి సీతారాం, డీఈఓ గోవిందరాజులు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జివి రమేష్ లు కవులు తమ కవితలతో కవులను అభినందించారు.కవులందరికీ మెమొంటో శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి సీతారాం, వివిధ శాఖల జిల్లా అధికారులు గోవిందరాజులు, డాక్టర్ జివి రమేష్, అనిల్ ప్రకాష్, హనుమంతు, కవులు వనపట్ల సుబ్బయ్య, గుడిపల్లి నిరంజన్, వహీద్ ఖాన్, కృష్ణారెడ్డి,పాషా, బాసం వెంకటేష్, మురళి, ఇద్దిరీస్ గఫార్ తదితరులు పాల్గొన్నారు.