ఆకతాయిల చేతిలో దహనమైన 14 బైకులు
హైదరాబాద్, జనంసాక్షి: సనత్‌నగర్ ఎస్‌ఆర్‌టీ కాలనీలోని కేకే రెసిడెన్సీ సెల్లార్‌లో ఈ తెల్లవారు జామున ఆకతాయిలు 14 ద్విచక్రవాహనాలను తగులబెట్టారు. దీంతో మెదటి అంతస్తుల్లో ఉన్నవారు భయంతో కిందికి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.