బీసీ రిజర్వేషన్లపై ఇతరులు లబ్దికి యత్నించడం సరికాదు
` కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు గర్హనీయం
` క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చట్ట వ్యతిరేకం
` ఖండిరచిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
హైదరాబాద్(జనంసాక్షి): ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు, క్యూ న్యూస్‌పై దాడి ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్పందించారు. ఈ రెండిరటినీ ఆయన ఖండిరచారు. కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చట్ట వ్యతిరేకమని.. గన్‌మన్ కాల్పులపై విచారణ జరుగుతోందని తెలిపారు. కాంగ్రెస్ కృషి ఫలితమే బీసీ బిల్లు, రిజర్వేషన్లు అని మహేశ్‌కుమార్ చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై ఇతరులు లబ్ధికి యత్నించడం సమంజసం కాదన్నారు.