ఆగస్టు 1 న ఆర్డీఓ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండ
జహీరాబాద్ జులై 27( జనంసాక్షి) కేంద్ర, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 1 న దేశ వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చిందని కార్యక్రమని జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షలు బి.రాంచందర్ తెలిపారు. బుధవారం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పెట్రోల్, డీజిల్,గ్యాస్,ధరలను విచ్చలవిడిగా పెంచుతూ దేశ ప్రజలను,పెదాలను,మధ్యతరగతి, ప్రజలపై పెను భారాన్ని మోపడని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నమని అన్నారు,జిఎస్టీ ని నిత్యావసర వస్తువుల పై పెంచి ప్రజల నుండి డబ్బులను దోచుకోవడం సరైంది కాదని అన్నారు. దేశ సంపాదనను కారు చౌకగా పెట్టుబడి దారులకు దోచి పెటుతుందని అన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలకు, దేశ ప్రజలను ఇబందులకు గురి చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమని జయప్రదం చేయాలని కొరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సంగన్న,శ్రీనివాస్,దశరత్, కౌడి. నర్సిములు,సంజీవ్, బి.నర్సిములు,యేసయ్య,బిరప్ప,లక్మాన్,తదితరులు పాల్గొన్నారు