*ఆగస్టు 3న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి*

 సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం

మునగాల, జూలై 29(జనంసాక్షి): 73షెడ్యూలు పరిశ్రమల కనీస వేతనాల జీవోలను సవరించాలని విడుదల చేసిన 5 జీవోలను  గెజిట్ చెయ్యాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నేలమర్రిలో కార్మికులతో కలిసి ఆగస్టు 3న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో కనీస వేతనాల చట్టం పరిధిలో 73 షెడ్యూలు ఎంప్లాయిమెంట్స్ ఉన్నాయి. ప్రతి 5సం”రాలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు సవరించాల్సి ఉందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు గడిచినా టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల వేతనాలు సవరించ లేదని అన్నారు. కార్మికుల పోరాటాల ఫలితంగా 2021 జూన్ లో 5 జీవోలను విడుదల చేసిందని, కానీ ఆ జీవోలను గెజిట్ చేయలేదని అన్నారు. కనీస వేతనాల జీవోలను సవరించాలని, హమాలి భవన నిర్మాణం ట్రాన్స్ పోర్టు రంగాల కార్మికులతో పాటు ఇతర కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 3న ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని, కార్మికులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు ఎస్కే సైదా, మండల కమిటీ సభ్యులు బచ్చలకూర రమణయ్య, బి రాజేష్, కె ప్రభాకర్, బి గోవర్ధన్, బి నాగేంద్రబాబు, ఆర్ సైదులు, బి వెంకటేశ్వర్లు, ఆర్ సుందరయ్య, ఆర్ సంజీవ్, బి వెంకన్న, బి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.