ఆగస్టు 7న నిర్వహించబోయే ఎస్సై పోస్టుల నియామక ప్రిలిమినరీ పరీక్షను పకడ్బంధిగా నిర్వహించాలి..

10 గంటల తరువాత అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యం అయిన అనుమతించకూడదు

పరీక్ష నిర్వాహకులకు బయోమెట్రిక్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ శిక్షణ కార్యక్రమంలో

జిల్లా ఎస్పీ  జె. రంజన్ రతన్ కుమార్ ..

జోగులాంబ గద్వాల్,జనం సాక్షి:

జిల్లా అదనపు ఎస్పీ  బి. రాములు నాయక్  ఆధ్వర్యంలో ఆగస్టు 7 వ తేదీన జరుగబోయే ఎస్సై పోస్టుల ప్రిలిమినరి నియామక పరీక్షకు సంబంధించి ఈ రోజు జిల్లా కేంద్రం లోని హిమాలయ హోటల్ బాoకేట్ హాల్ నందు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నియమావళి మేరకు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరెండెంట్ లకు, అబ్జర్వర్లకు ,బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు బయోమెట్రిక్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించి పరీక్ష సమయంలో సిబ్బంది మరియు అభ్యర్థులు పాటించవలసిన జాగ్రత్తల గురించి తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ  జె. రంజన్ రతన్ కుమార్  హాజరై పరీక్ష నిర్వాహకులకు, ఇన్విజిలేటర్స్ కు బియోమెట్రిక్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ పై, పకడ్బందీగా పరీక్షల నిర్వహణ పై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా కేంద్రం లో మొత్తం 4054 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరుకారున్నారని అందుకు మొత్తం 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందనీ అన్ని కేంద్రాలు జిల్లా కేంద్రంలో మాత్రమే ఏర్పాటు చేశారని, ఈ పరీక్షలు ఉదయం పదిగంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారని, అన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా మరియు పొరపాట్లు జరుగకుండా పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని పరీక్ష నిర్వాహకులను ఆదేశించారు.

రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గుర్తింపు కొరకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకోవడం జరుగుతుందని, ప్రతి కేంద్రం లో ఇందుకు వీలుగా అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక గంట ముందుగానే (ఉదయం 9 గంటలకు) పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఉదయం 9 గంటల నుండి అభ్యర్థులను పరీక్ష కేంద్రం లోనికి అనుమతించడం జరుగుతుందని సూచించారు. ఉదయం 10 గంటల తర్వాత అభ్యర్థులకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రం లోనికి అనుమతించరని అన్నారు. పరీక్షకు సంబంధించిన నిబంధనలు పూర్తిగా హాల్ టికెట్లో పొందపరచి ఉంటాయని, అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు హాల్ టికెట్ లోని నిబంధనలు చదువుకోవడం మర్చిపోవద్దని, పరీక్ష హాలు లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఇతర వస్తువులకు అనుమతి ఉండదని, చేతులకు గోరింటాకు , మేహంది వంటివి పెట్టుకోవడం వలన బయోమెట్రిక్ లో వేలిముద్రలు సరిగ్గా వచ్చే అవకాశం ఉండదని, తద్వారా అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంటుందని, ఈ విషయాన్ని గ్రహించి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గోరింటాకు, మెహంది, వంటివి పెట్టుకో రాదని సూచించారు. అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రం లోనికి అనుమతించరనీ,సెల్ ఫోన్లు, వాచ్ లు(చేతి గడియారాలు) మొదలగునవి ఎవరు తీసుకురాకూడదని తెలిపారు.
పరీక్ష కేంద్రాల వద్ద పార్కింగ్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహించడం జరుగుతుందని, అలాగే వైద్య సిబ్బంది ని ప్రతి కేంద్రానికి ఇద్దరి ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.
పరీక్ష కేంద్రం చీఫ్ సూపరిండెంట్ అనుమతి లేనిదే పోలీస్ సిబ్బంది తో సహా ఎవ్వరు కూడా పరీక్ష కేంద్రాల లోనికి వెళ్ళడానికి వీలు లేదని అన్నారు.
పరీక్ష కేంద్రాలలో ఇన్విజిలేటర్స్ కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లోపలికి తీసుకెళ్లకూడదని అన్నారు.
పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి జిరాక్స్, ప్రింటింగ్ షాప్స్ మధ్యాహ్నం వరకు ఓపెన్ చేయనియకుండా చూసుకోవాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.
అధికారులు అందరూ ఈ పరీక్షలను ప్రేస్టేజ్ గా తీసుకొని పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
Note: పరీక్ష వ్రాసే అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్న హల్ టికెట్ పై లేటెస్ట్ ఫోటో ను తప్పనిసరి గా అంటించుకొని రావాలని, అభ్యర్థులు హాల్ టికెట్, 2 బాల్ పాయింట్ పెన్స్ మాత్రమే వెంట తెచ్చుకోవాలని , సెల్ ఫోన్స్ ,ఇతర వస్తువులు పరీక్ష కేంద్రం దగ్గర పార్క్ చేయడానికి ఎలాంటి ఏర్పాటు చేయబడదని ఈ విషయాన్ని అభ్యర్థులు తప్పనిసరిగా గమనించాలని జిల్లా ఎస్పీ గారు అన్నారు.

పరీక్షకు సంబంధించిన నిబంధనలు కచ్చితంగా అమలు చేయబడతాయని తెలిపారు. ఎంపిక విధానం పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని అభ్యర్థులు గుర్తించాలని అన్నారు.

ఈ రాత పరీక్ష పూర్తిగా రీజినల్ కో-ఆర్డినేటర్ రామ్ మోహన్, నోడల్ ఆఫీసర్ జిల్లా అదనపు ఎస్పీ  బి. రాములు నాయక్ సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని, ఎవరికి ఎలాంటి సందేహాలు ఉన్నా వీరి దృష్టికి తీసుకువచ్చి, వారి సందేహాలు నివృత్తి చేసుకోవాలని అన్నారు.

ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ కో ఆర్డినెటర్ బాలాజీ, పాలిటెక్నిక్ కళాశాల ఏ. ఓ సిద్దిలింగయ్య, సాయుధ దళ డి. ఎస్పీ పి. ఇమ్మనియోల్ గారు, గద్వాల్, అలంపూర్, శాంతినగర్ సి. ఐ లు చంద్రశేఖర్ గారు, సూర్య నాయక్ , శివ శంకర్ , డీసీ ఆర్బీ ఇన్స్పెక్టర్ శివకుమార్ , ఆర్. ఐ లు నాగేష్ , పెద్దయ్య , గద్వాల్ టౌన్, రూరల్ ఎస్సై లు, ట్రాఫిక్ ఎస్సై, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరిండెంట్స్, ఆబ్జార్వర్లు, బయో మెట్రిక్ ఇన్విజిలేటర్స్, ఐటీ సెల్ ఇంచార్జి నాగరాజు, సిబ్బంది, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..