*ఆగస్టు 8,9,10 చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి* 

-జోగులాంబ గద్వాల మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు సలికా పోగు తిప్పన రాజు.
గద్వాల నడిగడ్డ, ఆగస్టు 2 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చలో ఢిల్లీ  కరపత్రాలను రిలీజ్ చేసిన అనంతరం జేఏసీ జిల్లా అధ్యక్షుడు తిప్పన్న రాజు మాట్లాడుతూ మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ సాధనకై ఈనెల 8,9, 10 తేదీలలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసన దీక్ష మహాధర్నాను మాదిగ జేఏసీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాజు కోరారు. ఎస్సీల ఉమ్మడి కులాల నిస్ఫూత్తి ప్రకారం విభజించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని పార్లమెంటులోచట్టం ద్వారానే సాధ్యమవుతుందని 2004లోనే సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది అన్నారు.  రిజర్వేషన్ల  అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు అనాది కాలం నుంచి పాలక పక్షాలు అన్యాయం చేయడం జరుగుతుంది దేశ సంపదలు అందరికీ సమభావం కలిగి ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతగానో కష్టపడి సర్వం కోల్పోయి తనకున్న మేధాశక్తితో భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచి సకల అవకాశాలను సమాన హక్కు కలగాలని కోరుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా ఎస్సీ రిజర్వేషన్లను ఒకే కులం విద్య ఉద్యోగ అవకాశాలు  పొందుతున్నారని, అంబేద్కర్  ఆశయం చిట్ట చివరి వాడు తన హక్కును వినియోగించుకునే విధంగా  ఏబిసిడి వర్గీకరణ పార్లమెంటులో చట్టం చేసి అందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. గత 75 సంవత్సరాల చరిత్రలో నాలుగు సంవత్సరాలు యస్ సి వర్గీకరణ ఫలాలు మన జాతికి అందితే స్వతంత్రంలో ఎన్నడు అభివృద్ధి చెందనత మన జాతి కొంత మేరకు అభివృద్ధి బాటకు వెళ్ళిందన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాజి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి కలిసి ఢిల్లీకి వెళ్లి నరేంద్ర మోడీనీ కలవాలని అడిగితే అపాయింట్మెంట్  ఇవ్వలేదన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి మాదిగ ఓట్లు వేయించుకొని ఎనిమిది సంవత్సరాలైనా ఎస్సీ వర్గీకరణ విషయాన్ని పక్కన పెట్టిందన్నారు ఎస్సీ వర్గీకరణ చేయకుంటే రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని జిల్లా అధ్యక్షుడు సలికా పోగు తిప్పన రాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహేష్ ,భీమన్న,రాజు ,అనిల్, సునీల్, శివ పాల్గొన్నారు.