ఆగస్టు2 సిరిసిల్ల కాంగ్రెస్ సభను విజయవంతం చేయండి

నాగార్జునసాగర్ (నందికొండ),నవ భూమి ప్రతినిధి,జూలై 14;నాగార్జున సాగర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం నియోజకవర్గ అధ్యక్షులు నాగరాజు యాదవ్ అధ్యక్షతన గురువారం నందికొండలో తెలంగాణ కాంగ్రెస్ మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి నివాసంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఇంచార్జి కొర్ర రాంసింగ్ నాయక్  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని తెలిపారు.ఆగస్టు 2 న సిరిసిల్లలో జరిగే రాహుల్ గాంధీ  సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.తదనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు సురేష్.ఐతగొని సతీష్. అధికార ప్రతినిధి భాను చందర్ రెడ్డి,మురళి కృష్ణ.జగదీశ్వర్ రెడ్డి.అంజి. హనుమంతు రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.