ఆజాద్‌తో ముగిసిన ముఖ్యమంత్రి భేటీ
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ,నామినేటెడ్ పదవుల అంశంపై గంటన్నరకుపైగా ఈ భేటీలో ఇరువురు నేతలు చర్చించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, వాయలార్ రవి , అహ్మద్ పటేల్‌తో భేటీ కానున్నారు.