ఆటపాటలను తిలకించిన మాజీ మంత్రి గీతారెడ్డి

జహీరాబాద్ అక్టోబర్ 16 (జనంసాక్షి)ఎంతగానో బిజీ బిజీ గా రాజకీయాలతో గడిపే మాజీ మంత్రి గీతారెడ్డి పిల్లల ఆటపాటలను తిలకించి ముచ్చటపడ్డారు. ఇలా పిల్లల ఆటపాటల తో ఆటవిడుపు గా గడిపిన సంఘటన కు జహీరాబాద్ పట్టణంలోని రాజ్ డాన్స్ అకాడమి నిర్వహించిన 15వ వార్షికోత్సవం వేదికైంది.
ఇక వివరాల లోకి వెళితే జహీరాబాద్ పట్టణంలోని రాజ్ డాన్స్ అకాడెమీ ని స్థాపించి 15సంవత్సరాలు గడిచి పోయిన సందర్భంగా ఆదివారం నాడు స్థానిక సిద్ధి హోటల్ లో నిర్వహించిన 15వ వార్షికోత్సవం వేడుకలకు అకాడెమీ నిర్వాహకుడు రాజు అధ్యక్షత వహించగా, మాజీ మంత్రి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె గీతారెడ్డి ముఖ్య అతిధిగా హాజరు కాగా, కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కండెం నర్సిములు, నర్సింహారెడ్డి, ఝరాసంగం మండల పార్టీ నాయకులు నరేష్ తో పాటు జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీమంత్రి జె గీతారెడ్డి మాట్లాడుతూ తాను సాంస్కృతిక శాఖగా ఉన్నప్పుడు పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నానని, ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందం కలిగిస్తోందని, రాజకీయాలతో ఎంతో బిజీ గా ఉండే తనకు ఈ రోజు చిన్నారులు నిర్వహించిన కార్యక్రమం ఆహ్లాద పరిచిందన్నారు.చిన్నారులు చేసిన డాన్సులలో వారి ప్రతిభ కనపడుతోందని,15సంవత్సరాలు గా డాన్స్ ఆకాడామి నిర్వహించడం పట్ల అకాడెమీ నిర్వాహకుడు రాజు ను ప్రత్యేకంగా ప్రశంశించారు. తాను ఉపాధి పొందుతూ, ఇలా పలువురు చిన్నారులకు డాన్స్ నేర్పించడం గొప్ప విషయం అని అన్నారు. అంతకు ముందు మాజీమంత్రి జె గీతారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, అనంతరం చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, డాన్స్ చేసి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్ లను అందచేశారు.
కాగా మాజీమంత్రి గీతారెడ్డి ప్రత్యేకంగా విద్యార్థులతో పలు పాటలకు నృత్యాలు చేయగా, తిలకించి ఆనందించారు. వారి నృత్యాన్ని తదేకంగా వీక్షించారు.