ఆడపడుచులకు చిరుకానుక బతుకమ్మ చీరలు.
పండుగ వాతావరణం లో బతుకమ్మ చీరల పంపిణీ.
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు.
తాండూరు సెప్టెంబర్ 29(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్ రేషన్ షాపులో 9,10,11,12,28 వార్డులకు సంబంధించిన మహిళలకు గురువారం స్థానిక వార్డు కౌన్సిలర్లతో కలసి ఆహార భద్రత కార్డుల ద్వారా మహిళలందరికి బతుకమ్మ చీరలను మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా
దీప నర్సింలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న చిరుకానుక బతుకమ్మ చీరలని,తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతికగా నిలిచే బతకమ్మ పండుగ రోజున రాష్ట్రంలోని ఆడపడుచులందరూ ఆనందోత్సాహాల మధ్య పండుగ నిర్వహించుకోవాలని సంబంధిత లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ 2017లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని,నాటినుండి నేటి వరకు ప్రతి సంవత్సరం వినూత్న రంగులతో సరికొత్త జరి అంచులతో నాణ్యమైన చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఆడపడుచులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్.పి లు వనజ,సైర భాను,హారిక డీలర్లు మహేష్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.