ఆడపిల్లలను చిన్నచూపు చూడరాదు
డిసిపిఓ నరసింహులు
మల్దకల్ అక్టోబర్11(జనం సాక్షి)అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని,ఇధి మా సమయం,మా హక్కులు,మా భవిష్యత్తు అనే అంశం పై మంగళవారం ఎల్కూరు, మద్దెలబండ,పెద్దదొడ్డి, గ్రామంలో,బాలల పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి డిసిపిఓ నరసింహులు హాజరై మాట్లాడారు.బాలికలకు తమ హక్కుల పట్ల అవగాహన కల్పించడం,సమాజంలో బాలికల సంరక్షణ,హక్కులు, ఆరోగ్యం,విద్య,సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై అవగాహన కలిపించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం ముఖ్య లక్ష్యం,మనం లింగ ఆధారిత వివక్షను అంతం చేసే దిశగా అడుగు వేయాలి,లింగం ఆధారంగా వివక్ష తరచుగా ఇంట్లోనే మొదలవుతుంది, బాలికలను వారి ఇళ్లలో సమానంగా చూస్తే సరిపోతుంది.
ఇంట్లో మగ,ఆడ ఇద్దరినీ సమానంగా చూడాలి,ఇంట్లో- పాఠశాలలో లింగ సమానత్వం గురించి వారికి అవగాహన కల్పించాలి.బాలికలే లైంగిక వేధింపుల ప్రాథమిక బాధితులుగా కొనసాగుతున్నారు. సమాజంలో అత్యంత దుర్బలమైన వర్గాలలో ఆడపిల్ల ఒకటి,ఇంకా లైంగిక హింస నేరాల నుండి వారిని రక్షించాల్సిన అవసరం చాలా ఉంది,బాలిక సంరక్షణ అందరూ కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొత్తింటి జయమ్మ నారాయణ, రాధ నీల,పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు,మారెప్ప,ప్రకాష్ ,ఏఎన్‌ఎం,పాఠశాల ఉపాధ్యాయులు,మహిళలు,అంగన్‌వాడీ టీచర్లు,ఆశా వర్కర్లు, కిశోర బాలికలు,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.