ఆత్మకూరు మండలంలో విషాదం
వరంగల్ : ఆత్మకూరు మండలం పసరగొండలో విషాదం చోటుచేసుకుంది. కన్న కొడుకుల ఆదరణ కరువై వృద్ధ దంపతుల బలవన్మరణానికి పాల్పడ్డారు. గత కొన్ని రోజులుగా కొడుకులు పట్టించుకోకపోవడంతోనే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.