ఆత్మగౌరవానికి ప్రతీక, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు
పేదల ముఖాల్లో ‘డబుల్’ సంతోషం;మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ
కోదాడ టౌన్ అక్టోబర్ 14 ( జనంసాక్షి )
కోదాడ పట్టణంలోని స్థానిక 02,05,08,11,14,17,20,
23,26,28,31,34 వార్డులో శుక్రవారం ఏర్పాటుచేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక వార్డు సభకు మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది అన్నారు.కూడు,గూడు,గుడ్డ అనేవి ప్రతి మనిషికీ ప్రాథమిక అవసరాలు.ఇవి ఆత్మగౌరవానికి నిదర్శనాలు.పేదలకైతే ఇంకా ఎక్కువే. పేదలకు నివాసం అంటే చాలీచాలని ఇరుకుగది కాదని తెలంగాణ ప్రభుత్వం భావించింది.కనీసం రెండు తరాలకు ఉపయోగపడే విధంగా పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తి ఉచితంగా నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.అందుకు అనుగుణంగానే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టి అర్హులు అయిన ప్రతిఒక్కరికీ సొంత ఇంటి కళను
నెరవేరుస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వీరితో పాటు తహశీల్దార్,శ్రీనివాస్ శర్మ, వార్డ్ కౌన్సిలర్స్ తిపిరిశెట్టి సుశీల రాజు, కందుల చంద్రశేఖర్, విజయేద్ర , వార్డ్ ఆఫీసర్స్ నారాయణ, నాగిరెడ్డి, తనీష్, అనిత, లలిత, దేవి, నాయకులు బషీర్,నిజాం, జాఫర్ , సాదిక్ , చందు,సత్యనారాయణ,గురునాధం, ఖరీం,మునిసిపల్ అధికారులు మరియు డబుల్ బెడ్రూం ఇళ్ళ లబ్ధిదారులు వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.