ఆత్మీయుల ఆధ్వర్యంలో ఘనంగా సంకు సత్తిరెడ్డి జన్మదిన వేడుకలు
బయ్యారం,అక్టోబర్16(జనంసాక్షి):
ఆదివారం బయ్యారం మండల తెరాస అధికార ప్రతినిధి సంకు సత్తిరెడ్డి జన్మదిన వేడుకలు ఆయన ఆత్మీయులు, అభిమానుల నడుమ ఘనంగా జరిగాయి.ఈ సందర్బంగా ఆయన ఆత్మీయులు మాట్లాడుతూ…సంకు సత్తిరెడ్డి తన నిస్వార్ధమైన మనసు, చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా అందరిని కలుపుకు పోయే తీరుతో బయ్యారంలో ఎందరో అభిమానుల మనసును చూరగొన్నారని, అందుకే ఈరోజే స్వచ్ఛందంగా బయ్యారంలోని వర్తక-వ్యాపారులు,ఆత్మీయలు, పిల్లలు తన మీద ఉన్న అభిమానంతో ముందుకు వచ్చి ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కల్మషంలేని మనసున్న సంకు సత్తిరెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.జన్మదిన వేడుకలు అభిమానులు,ఆత్మీయుల సమక్షంలో జరుపుకోవడం ఎంతో సంతోషం గా ఉందని సంకు సత్తిరెడ్డి ఆనందం వ్యక్తపరిచారు.