ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో నిలిచిన పత్తి కొనుగోళ్లు

bkpd2ttn
హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ మార్కెట్‌యార్డులో పత్తి కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. పత్తికొనుగోళ్లు జరపబోమంటూ వ్యాపారులు మార్కెట్‌ కార్యదర్శికి లేఖ రాశారు. దీంతో సీసీఐ ద్వారా పత్తికొనుగోలు చేసేందుకు మార్కెటింగ్‌ శాఖ అధికారులు యత్నిస్తున్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్న వారినే పోలీసులు మార్కెట్‌ యార్డులోకి అనుమతిస్తున్నారు. వ్యాపారులు, సీసీఐ ఉద్దేశపూర్వకంగానే వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.