ఆదివాసి గిరిజన 5 తెగల విద్యార్థులు బాగుపడాలంటే

పి టి జి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలను హైదరాబాదులోనే కొనసాగించాలి.
ఆదివాసి చెంచు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాసులు.
అచ్చంపేట ఆర్సి, 30 జూలై (జనం సాక్షి న్యూస్) : (పి టి జి )కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలను మన్ననూరుకు తరలించవద్దని హైదరాబాద్ లోనే కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ కు వినతి పత్రం అందజేసిన ఆదివాసి చెంచు ఐక్యవేదిక నాయకులు. ఈ సందర్భంగా ఆదివాసి చెంచు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాసులు మాట్లాడుతూ .. హైదరాబాదులో హయత్ నగర్ లో ఉన్న పి వి టి జి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ  కాలేజీని తిరిగి మననరకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసిందని, ఈ కాలేజీలో కేవలం 5 తెగలకు సంబంధించిన వారు మాత్రమే అర్హులని, ఈ ఐదు తెగలకు సంబంధించిన విద్యార్థులు హైదరాబాదులోనే కొనసాగించాలని కోరుకుంటున్నారని ఇందులో భాగంగా ఒకటైన చెంచు తెగ కూడా కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలను హైదరాబాదులోనే కొనసాగించాలని ,  దీని వల్ల ఆదివాసీ గిరిజన విద్యార్థులు  శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని  మరింత ఉన్నత మైన  రంగాలలో రాణించడానికి ఆస్కారం ఉందన్నారు. చదువుకోవడానికి కావలసిన ఉన్నత విద్యార్హతలు గల బోధన సిబ్బంది అందుబాటులో ఉండి పేద ఆదివాసి గిరిజన తెగల విద్యార్థులను నీట్ ప్రవేశ పరీక్షల్లో మెరుగైన ర్యాంకులు తెచ్చుకుని  వైద్య విద్య అభ్యసించేందుకు మరియు ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో చదివేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాల ను మన్ననూర్ లో కొనసాగించడం వలన చెంచు తెగ తో పాటు మిగతా తెగల విద్యార్థులు ప్రహరీ గోడలు దాటి  చెట్ల వెంట పుట్టల వెంట తిరుగుతూ చదువుకు దూరమై వారి జీవితాలు చిద్రమవుతాయని సరైన శక్తి లేని సిబ్బంది లేక నిర్వహణ సరిగ్గా లేక కాలేజీ బ్రష్టు బట్టి పోతుందని తెలిపారు .దే విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినామని తెలిపారు. కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలను బేషరతుగా హైదరాబాద్ లొనే  కొనసాగించాలని లేనియెడల ఆదివాసి గిరిజన తెగలఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.