ఆదివాసీల ఆస్తిత్వ పోరుగర్జన బహిరంగ సభకు తరలి వచ్చి విజయవంతం చేయాలి.
తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్ పిలుపులో భాగంగాబుధవారం రోజున మండలలోని అదివాసి భవనంలో డిసెంబర్ 9న ఇంద్రవెల్లిలో జరిగే ఆదివాసీల ఆస్తిత్వ పోరుగర్జన బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్ మాట్లాడుతూ ఆదివాసీలు భారీగా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల కోసం సమస్యల పరిష్కారం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించి ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పీసా 1/70 చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు.జీవో 3ను యధావిధంగా అమలు చేసి ఐదవ షెడ్యూలు ప్రాంతంలో ప్రభుత్వం 29 శాఖల్లో ఉన్న ఖాళీలను ఆదివాసీలతో భర్తీ చేయాలన్నారు.జిల్లాలో ఆదివాసీ గిరిజన యూనివర్సిటీ ని ఏర్పాటు చేయాలని కోరారు. అర్హులైన ఆదివాసీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా మండల కేంద్రాలలో నివసిస్తున్న వారిలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నెరడిగొండ మండల అధ్యక్షుడు జుగునక్ సంబన్న ప్రధానకార్యదర్శి కానక గణేష్ జిల్లా ఉపాధ్యక్షుడు కోటనక్ కోటేశ్వర్ ఎంపీటీసీ మాదాడి కృష్ణ, సిడం ప్రభాకర్ విద్యర్థి.సంఘ నయకులు మేస్రం భస్కర్ సలాం వరుణ్ ,ఆత్రం బీమ్ రావ్, ఆత్రం లక్ష మాన్ దుర్వా రాజు ఆడ సంతోష్ సర్పంచ్ ఆర్కా యాదవ్, కోటనక్ రామారావు ఆత్రం మహేందర్ మండల అద్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.