ఆధార్‌కు తుది గడువు జూన్ 30
జనంసాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ జూన్ 30 లోగా ఆధార్ కార్డుల కోసం తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కావాల్సిన కసరత్తు పూర్తి చేస్తున్నట్లు ఆధార్ రీజినల్ డెప్యూటీ డెరైక్టర్ ఎంవీఎస్ రామిరెడ్డి ‘న్యూస్‌లైన్’ కు తెలిపారు. ఆధార్‌పై అధికారులతో సమీక్ష సమావేశానికి ఆయన విజయవాడ వచ్చారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 6.40 కోట్ల మంది ఆధార్ నమోదు పైర్తయిందన్నారు. వీరికి జూన్‌లోగా కార్డులు జారీ చేస్తామన్నారు. మిగిలిన వారు జూన్ 30 లోగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాకు ఒకటి చొప్పున శాశ్వత ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వివరించారు.