ఆధార్ కోసం అవస్తలు
మరిపెడ: మండలంలోని అబ్బాయిపాలెం, గాలివారి గూడెం, జయ్యారం, పురుషోత్తమాయి గూడెం, ధర్మారం వీరారం, చిల్లంచెర్ల తదితర గ్రామాల్లో ఆదివారం కార్డుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అబ్బాయిపాలెంలో గ్రామ వాసులు ఉదయం తొమ్మిది గంటలకే ఆదార్ కేంద్రాలకు బారులు తీరారు. కానీ మధ్యాహ్నంవరకూ నమోదు ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సరైన ఏర్పాట్లు చేయలేదని గ్రామస్థులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.