సిద్దిపేట: సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి, తాజా మాజీ మంత్రి హరీశ్‌రావు దూసుకుపోతున్నారు. మూడో రౌండ్ ముగిసే సరికి ఆయన 19,925 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ సైతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ ఫలితాలు వెలువడే సరికి ఆయన 4764 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మహబూబ్ నగర్, వనపర్తి, మక్తల్, కొల్లాపూర్, అలంపూర్ లో టీఆర్ఎస్ లీడ్ లో ఉంది. కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు, వనపర్తిలో నిరంజన్ రెడ్డి 2 వేల ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. మక్తల్ లో చిట్టెం రామ్మోహన్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ కు భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది.
నాగార్జునసాగర్‌లో జానారెడ్డిపై కొనసాగుతున్న టీఆర్‌ఎస్ ఆధిక్యత. రెండో రౌండ్‌లోనూ జానారెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల 601 ఓట్లు ఆధిక్యం. వరంగల్ తూర్పు టీఆర్‌ఎస్ 4878.. వర్దన్నపేట టీఆర్‌ఎస్ 6554.. వరంగల్ పశ్చిమ టీఆర్‌ఎస్ 5648.. జనగామ టీఆర్‌ఎస్ 4000 ఆధిక్యంలో ఉంది.