ఆధునికరించిన పాఠశాలను ప్రారంభించిన మంత్రి.
నెన్నెల, మార్చ్ 16, (జనంసాక్షి )
నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద 16.5 లక్షల నిధులతో ఆధునికరించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని గురువారం అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు ఎనలేని ప్రాముఖ్యత ఇస్తుందని, దీనికి నిదర్శనం కంటి వెలుగు, మన ఊరు – మనబడి అభివృద్ధి కార్యక్రమాలే అన్నారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు, గ్రంథాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్య, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, ఆర్డివో శ్యామల దేవి, తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీపీ సంతోషం రమాదేవి, జడ్పీటీసీ సింగతి శ్యామల, సింగల్ విండో చైర్మన్ మేకల మల్లేష్, స్థానిక సర్పంచ్ ఇందూరి శశికళ రమేష్ , నాయకులు గడ్డం భీమా గౌడ్, సంతోషం ప్రతాప్ రెడ్డి, సింగతి రాంచందర్, పంజాల విద్యా సాగర్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.