ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజ శ్రేయస్సు. ఎమ్మెల్యే బాపురావు
గుడిహత్నూర్: అక్టోబర్7 ( జనం సాక్షి)ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజ శ్రేయస్సు చేకూరుతుందని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్అన్నారు. శుక్రవారం మండలంలోని ఉమ్రి. బి రామ మందిరంలో శ్రీ సంత్ సదానంద మహారాజ్ యొక్క పుణ్యతిధి కార్యక్రమంలోపాల్గొని సంత్ నారాయణ్ మహారాజ్ ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ఆలకించి అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఇలాంటి కార్యక్రమాలతో ఆధ్యాత్మికభావనపెంపొంది,మానసిక పురోగతి జరిగి,సమాజ ఉన్నతికి తోడ్పడుతుందని,నారాయణ్ మహారాజ్ తన ప్రవచనాలతో ఎంతో మంది విలువలతో కూడిన జీవితాన్ని గడపడానికి దోహధపడడం చాలా గొప్ప విషయమని అన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్, జంగు,ముండే రావణ్,రాందాస్, వైద్యనాథ్. సంతోష్ గౌడ్ ,పాటిల్ రాందాస్. కార్యకర్తలు,భక్తులు పాల్గొన్నారు.
Attachments area