ఆధ్యాత్మిక సదస్సుకు దారుస్సలాం తరలివెళ్లిన ఎంఐఎం శ్రేణులు..

జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించిన ఎంఐఎం అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్..
కరీంనగర్, అక్టోబర్ 8:-
ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ దారుసలాంలో నిర్వహించ తలపెట్టిన జల్సా రహమతుల్-లీల్-ఆలమీన్ ఆధ్యాత్మిక బహిరంగ సభకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి వందలాదిగా ఎంఐఎం శ్రేణులు, పార్టీ నగర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో శనివారం తరలివెళ్లారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ .. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి 100 వాహనాలలో 500 మంది, కరీంనగర్ పట్టణం నుంచి 30 డివిజన్లలో ప్రతి డివిజన్ నుంచి 4కార్ల చొప్పున 125 వాహనాలలో దాదాపు 700 మంది ఎంఐఎం పార్టీ నాయకులు, డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, క్రియాశీలక కార్యకర్తలు హైదరాబాద్ తరలివెళ్లినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా భారీ ఎత్తున క్రియాశీలక కార్యకర్తలను కూడగట్టి ఎక్కువ సంఖ్యలో వెళ్లినట్లు చెప్పారు. ర్యాలీకి ముందు జగిత్యాల ఎంఐఎం అధ్యక్షుడు యునూస్ నదీమ్ దువా ప్రార్థనలు చేశారు. ఈకార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ, కార్పొరేటర్లు శర్ఫుద్దీన్, ఆతిన, అలీబాబా, జగిత్యాల కౌన్సిలర్ రజియోద్దీన్, సాజిద్ బాండ్ తదితరులున్నారు.