ఆన్లైన్ మోసాలకు బలికావద్దు…….
ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి ..
…..కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో డిప్యూటీ పోలీస్ కమిషనర్ అరవింద్ బాబు.
నిజామాబాద్ 28 (జనం సాక్షి )
ఆన్లైన్ మోసాలకు సామాన్య ప్రజలు బలికావద్దని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలో పాటించాలని నిజామబాద్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ వి అరవింద్ బాబు అన్నారు. గురువారం నగరంలోని మూడవ పట్టణ టౌన్ పరిధిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ నేరాల నియంత్రణలో భాగంగా ముందు జాగ్రత్త కోసం మూడో పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు దాదాపు 140 వాహనాల వాహనదారుడు యొక్క డాక్యుమెంట్లు చెక్ చేసి వాటి వివరాలు సేకరించడం జరిగిందని అన్నారు. డాక్యుమెంట్లు లేని మొత్తం 91 ద్విచక్ర వాహనాలు 17 ఆటోలు ట్రాలీ ఒకటి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నిజామాబాద్ ప్రజలతో సత్సంబంధాలు కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ,ప్రధానంగా వాహనదారులు క్రమం తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించాలన్నారు. వాహనదారుల యొక్క పత్రాలు వారి వద్ద ఉంచుకోవాలని సూచించారు. సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తలు పాటించాలని సైబర్ నేరాలు చేసే వారి ఉచ్చులో పడకూడదని, ఎలాంటి పరిచయం లేని వారు ఆన్లైన్ ద్వారా మన సమాచారం అడిగినట్లయితే ఎవ్వరికి ఇవ్వకూడదని అన్నారు. లక్కీ డ్రా పేరుతో ఎవ్వరికి డబ్బులు ఇవ్వకూడదని ఆన్లైన్లో ప్రాడింగ్ మోసాలకు గురికా వద్దన్నారు.ఏదైనా కొత్తవారు అనుమాన స్థితిలో తిరిగితే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలన్నారు. ఇంటి యజమానులు కిరాయి కోసం ఎవరైనా వస్తే వారి యొక్క ఆధార్ కార్డు సేకరించుకొని అద్దెకు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసిపి ఏ వెంకటేశ్వర్లు, నలుగురు సిఐలు, 10 మంది ఎస్ఐ లు, ఏఎస్ఐలు ,హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్స్, మహిళా పోలీసులు, మహిళా హోంగార్డులు మొత్తం 125 పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.