ఆన్‌లైన్‌లో అమ్మండి` రాష్ట్రాకు సుప్రీం సూచన

న్యూఢల్లీి,మే 8(జనంసాక్షి):  మద్యం అమ్మకాను ఆన్‌లైన్‌లో అందించే ఆలోచన చేయాని సుప్రీంకోర్టు సూచించింది.హోమ్‌ డెలివరీ మద్యం అమ్మకాకు రాష్ట్ర ప్రభుత్వాు చర్యు చేపట్టాని సూచించింది. వైన్‌ షాపు వద్ద భారీ జనసమూహాన్ని అరికట్టేందుకు హోం డెలివరీ అవసరమని కోర్టు అభిప్రాయపడిరది. ఈ అంశంపై వేసిన పిల్‌పై స్పందిస్తూ కోర్టు ఈ సూచను చేసింది. వాస్తవానికి ఈ కేసులో కోర్టు ఎటువంటి ఆదేశాు జారీ చేయలేదు. సోషల్‌ డిస్టాన్సింగ్‌ అము చేయాంటే.. మద్యాన్ని హోం డెలివరీ చేయాల్సిన అవసరం ఉన్నట్లు కోర్టు చెప్పింది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, సంజయ్‌ కృష్ణ కౌల్‌, బీఆర్‌ గవితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ సూచన చేసింది. కోర్టు ఈ కేసును వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ వ్ల మద్యం షాపు మూతపడ్డాయి. అయితే నాుగు రోజు నుంచి కొన్ని రాష్టాు మద్యం అమ్మకాను మొదుపెట్టాయి. దీంతో జనం ఒక్కసారిగా షాపు ముందు చేరుకుంటున్నారు. కిలోవిూటర్ల కొద్ది క్యూలైన్లు ఉంటున్నాయి. ఈ అవస్థు తప్పించేందుకు కోర్టు ఈ సూచన చేసింది. ఇదిలావుంటే కేంద్ర ప్రభుత్వం మద్యం విక్రయాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో మద్యం దుకాణా ముందు మందు బాఋ బాయి తీరారు. అన్ని మద్యం షాపు ముందు కిలోవిూటర్ల మేర క్యూలైన్లు దర్శనమిచ్చాయి. కనీసం భౌతిక దూరం పాటించకుండా ఒకరి విూద తోసుకుంటూ లిక్కర్‌ కోసం ఎదురు చూసిన దృశ్యాు అనేకం. దీంతో కొన్ని రాష్ట్రాల్లో మద్యం షాపు తెరిచిన వెంటనే మళ్లీ మూసివేశారు. అక్కడక్కడా పోలీసు లాఠీకు పనిచెబుతున్నా జనం లెక్కచేయకుండా  షాపు ముందు బాయి తీరుతున్నారు. ఈ సమస్యను చెక్‌ పెట్టేందుకు ఢల్లీి కేజ్రివాల్‌  ప్రభుత్వం కొత్త ప్రణాళికను రచించింది. ఈ`టోకెన్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇకపై మద్యం కొనాంటే టోకెన్‌ విధానాన్ని అనుసరించాల్సిందే. టోకెన్‌ నెంబర్‌ ఆధారంగా ఆ టైంలోనే మద్యం షాపుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ముందుగా వివరాు నమోదుచేసుకున్న వారు ఆ సమయానికి  వెళ్లి నేరుగా మద్యాన్ని కొనుగోు చేయవచ్చని తెలిపింది