ఆన్లైన్ ద్వారా స్కాలర్షిప్లు
కాకినాడ, జూలై 23,: జిల్లాలో వెనుకబడిన తరగతులు, కులాలకు చెందిన 2012-2013 విద్యా సంవత్సరానికి గానూ ఫీజుల రీయంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లు పొందే విద్యార్ధిని, విద్యార్ధులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి ధనరాజు తెలియజేశారు. 2012-2013 సంవత్సరానికి ఆయా కళాశాలల విద్యార్ధినీ విద్యార్ధులు త్వరితంగా ఉపకార వేతనాలు పొందటానికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలిపారు.