ఆపదలో ఆదుకొనే ఆపద్బాంధవుడు

మానవసేవే మాధవసేవని నమ్మిన యుగ పురుషుడు

తాత, తండ్రి ల స్ఫూర్తితో….

సమాజసేవలో తనకంటూ ఓ పేరు లిఖిస్తున్న యువకుడు.

పేద విద్యార్థులను చదివిస్తున్న జూనియర్ సోను సూద్.

 

పార్టీల చూపు ఆ యువకుడి వైపే.

పినపాక నియోజకవర్గం ఆగస్టు 18( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన నవీన్ బాబు ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలుస్తున్నారు. బెంగళూరులో ఇన్ స్ట్రాన్ అనే కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ తన తాత వెంకట నరసింహ రాజు, తండ్రి సోమరాజు పేదలకు చేస్తున్న సేవలకు ఆకర్షితుడై తనకున్న సంపాదనలో అనేకమంది పేదలకు వైద్య,విద్య ఆర్థిక సాయం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో బెంగళూరు నుండి స్వగృహానికి వచ్చిన నవీన్ బాబు ఆపద అంటే నేనున్నానంటూ స్పందించి అనేక మందికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. సొంత మండలం లోని నిరుపేద విద్యార్థులకు పేదరికంతో వాళ్ళ చదువులకు ఆటంకం కలగకుండా ప్రతి ఏడాది పాఠ్య పుస్తకాలు అందజేస్తున్నారు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన చాలామంది కూలీలకు ప్రాంతం, కులం, మతం అనే తేడా లేకుండా బాధితులకు తన సొంత ఖర్చులతో సహాయం అందజేశారు. పేద విద్యార్థులు అయినా 12 మందిని దత్తత తీసుకొని వారికి విద్యాభ్యాసం నేర్పిస్తున్నారు. అంతే కాకుండా మరో 25 మందికి చదువుకు అయ్యే ఖర్చు తానే భరిస్తున్నడు. ఈ సేవలను గుర్తించిన దిశా ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారు ఘనంగా సన్మానించారు. ఆపదలో ఉన్నవాళ్లు సహాయం కావాలని ప్రత్యక్షంగానే కాకుండా సోషల్ మీడియా ద్వారా వచ్చిన వార్తలను కూడా స్పందిస్తూ నేనున్నానంటూ స్పందిస్తూ అనాధలకు, నిరుపేదలకు, సహాయం కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరి మనసులో మనసున్న మారాజే నిస్వార్థ సేవ చేసే నవీన్ బాబే మా రియల్ హీరో అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. తన సంపాదనలో 50 శాతం పేద ప్రజలకు వినియోగిస్తు ప్రజల మనిషి గా పేరు పొందారు.

కుడి చేతితో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియకుండా ఉండాలనేదే తన నైజం :-

మణుగూరు మండలంలోని తోట రాజేష్ చైతన్య దంపతుల కుమార్తె హారిక వర్షిని కి రెండు కిడ్నీలు పాడైపోయే ఆర్థిక పరిస్థితి బాగాలేక హాస్పటల్ లో చికిత్స పొందుతుందని సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని వెంటనే 25 వేల ఆర్థిక సహాయం అందజేసారు. భద్రాచలం శ్రీనివాస నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతున్న ప్రిన్స్ ను స్వయంగా కలిసి వారి కుటుంబానికి 25వేల ఆర్థిక సాయం అందజేశారు. ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలానికి చెందిన బోడా అజయ్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారాని తెలుసుకుని చికిత్స చేసేందుకు దాతలు ముందుకు రావాలని సోషల్ మీడియాలో పెట్టిన వీడియో పోస్టులకు నవీన్ బాబు స్పందించి చికిత్స నిమిత్తం లక్ష రూపాయలు అందజేశారు. అలాగే 2014 సంవత్సరంలో పుట్టిన పిల్లలకు ఆపరేషన్ చేయడానికి 5లక్షల రూపాయలు ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు.. పగిడేరు గ్రామంలో రాజేష్ అనే వ్యక్తి కి వైద్యం నిమిత్తం 60 వేలు ఇచ్చారు. కర్ణాటక రాష్ట్రంలోని 12 మంది అనాధ పిల్లలను దత్తత తీసుకొని హాస్టల్ లో ఉంచి అన్ని తానే వారి బాగోగులు చూసుకుంటున్నారు. ఆ 12 మంది పిల్లలకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నారు. బూర్గం పహాడ్ మండల విలేకరిగా పనిచేసిన చేస్తున్న ఓ విలేఖరికి కరోనా సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో అతనికి తన వంతు సాయంగా 20 వేల రూపాయలు చేశారు.. గ్రామానికి చెందిన క్యాన్సర్ పేషెంట్ కి 10 వేల సాయం అందించారు.కోట్లకు అధిపతి అయిన చేయాలనే గొప్ప సేవ ఆయనకే సొంతం తీసుకోవడం కాదు ఇవ్వటమే గొప్ప అనే నానుడి నమ్మి ఉన్న దాంట్లో సహాయం చేయాలని ఆలోచనతో నవీన్ బాబును ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.