ఆఫ్ఘన్‌లో అమెరికన్ యూనవర్సీటీస్‌పై దాడి
– 12 మంది మృతి
కాబూల్,ఆగస్టు 25(జనంసాక్షి): ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న అమెరికా యూనివర్సిటీపై సాయుధులు జరిపిన దాడిలో 12 మంది మృతిచెందారు. మరో 30 మంది గాయపడ్డారు. కాబూల్‌లో ఉన్న వర్సిటీ నుంచి సుమారు 700 మంది విద్యార్థులను సురక్షితంగా రక్షించినట్లు ఆ నగర పోలీస్ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ రహిమి తెలిపారు. ఈ ఘటనలో ఓ విదేశీ టీచర్ గాయపడ్డట్లు సమాచారం. విదేశీయులను కిగడ్నాప్చేయడం, విదేశీ సంస్థలు లక్ష్యంగా దాడులుచేయడం ఇటీవల పెరిగింది. కాబూల్ నగరానికి శివారు ప్రాంతంలో ఉండే అమెరికా వర్సిటీపై ఎవరు దాడి చేశారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఏ సంస్థ కూడా బాధ్యత ప్రకటించలేదు. 2006లో అమెరికా వర్సిటీని ఏర్పాటు చేశారు. అమెరికా రూపొందించిన ఆర్ట్స్ కోర్సులపై ఆ వర్సిటీలో విద్యను అందిస్తారు. వర్సిటీలో సుమారు వెయ్యి మంది విద్యార్థులు ఉంటారు. దాడికి ప్రయత్నించిన సాయుధులు ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని మాత్రం పోలీసులు ఇంకా నిర్దారించలేకపోయారు. దాడి వల్ల జరిగిన పేలుడుతో విద్యార్థులకు తీవ్ర గాయలయ్యాయి. ఆఫ్ఘన్ భద్రతా దళాలతో పాటు, అమెరికా సైన్యం కూడా వర్సిటీ ప్రాంతాన్ని చుట్టుముట్టేసింది. వర్సిటీకి చెందిన సిబ్బందిని రెండు వారాల క్రితమే కొందరు కిడ్నాప్ చేశారు. ఇంకా ఆ సిబ్బంది ఆనవాళ్లు తెలియకముందే మళ్లీ దుండగులు వర్సిటీపై కాల్పులకు తెగించారు. ఆఫ్ఘన్ భవిష్యత్తుపైనే దాడి జరిగిందని అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.