ఆమ్‌ ఆద్మీ పార్టీలో ముసలం

పార్టీకి గుడ్‌బై చెప్పాలనుకుంటున్న సీనియర్లు

న్యూఢిల్లీ, మార్చి 1 : ఆమ్‌ ఆద్మీ పార్టీలో ముసలం పుట్టింది. పార్టీ వ్యవస్థాపక సభ్యుడు ప్రశాంత్‌ భూషణ్‌, యోగింద్ర యాదవ్‌లు పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీని ప్రక్షాళనం చేయాలని ఆ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆలోచిస్తున్న నేపథ్యంలో సీనియర్లు ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మంత్రి వర్గ విస్తరణ లేదని కేజ్రీవాల్‌ స్పష్టం చేయడంతో ప్రశాంత్‌ భూషణ్‌, యోగింద్రయాదవ్‌లు పార్టీని వదిలి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలియవచ్చింది.

నిన్న (శనివారం) జరిగిన సమావేశంలో పార్టీలో సభ్యుల మఽధ్య విబేధాలు తలెత్తిన కారణంగా సీనియర్లు ఇద్దరూ తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన తర్వాత కేజ్రీవాల్‌తో ప్రశాంత్‌భూషణ్‌, యాదవ్‌ల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. అయితే ఇప్పుడు అవి తారాస్థాయికి చేరాయి.