ఆయిల్‌పామ్‌ సాగు రైతులకు సబ్సిడీ

ఎమ్మెల్యే

కరీంనగర్‌,జూలై8(జనంసాక్షి):ఆయిల్‌పామ్‌ సాగుపై రైతులు దృష్టిసారించాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ సూచించారు. తరుచూ ఒకే విధమైన పంటలు వేయడం వల్ల దిగుబడి తగ్గుతుంద న్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతుల ఆలోచన విధానం మారాలన్నారు. నూనెగింజలకు మంచి డిమాండ్‌ ఉన్నందు న రైతులు ఆయిల్‌పామ్‌ సాగుచేయడం ద్వారా ఆర్థికంగా బలపడవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ సాగుచేయడానికి సబ్సిడీ ఇస్తుందన్నారు.ఆయిల్‌పామ్సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తోందన్నారు. అలాగే మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తోందన్నారు.