ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో ప్రైవేటు వైద్య ఆసుపత్రుల నమోదు తప్పనిసరి

హుజూర్ నగర్ సెప్టెంబర్ 1 (జనం సాక్షి): ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో ప్రైవేటు వైద్య ఆసుపత్రుల నమోదు తప్పనిసరిగా చేయించాలని జిల్లా మీడియా అధికారి అనంత అంజయ్య గౌడ్, ప్రోగ్రాం అధికారి కిరణ్ కుమార్ లు అన్నారు. హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ నందు ఏర్పాటయిన ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల సమావేశంలో వారు మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ నుంచి అనుమతి పొందిన జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోo లు, ల్యాబ్లు, స్కానింగ్ సెంటర్లు, డెంటల్ క్లినిక్, ఎక్స్ రే సెంటర్లు, ఫిజియోథెరపీ సెంటర్లు తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశానుసారం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఆన్లైన్ పోర్టల్ లో విధిగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రైవేటు వైద్య సంస్థల నమోదు కొరకు  జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం (కుడకుడ), ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, కోదాడ (ప్రభుత్వఆసుపత్రి), నేరేడుచర్ల, మేళ్లచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ నమోదు ప్రక్రియ స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. కావున అన్ని ప్రైవేటు ఆసుపత్రులు, రక్తపరీక్ష , డెంటల్ ఫిజియోథెరపీ స్కానింగ్ సెంటర్లు రిజిస్టర్ చేసుకోవాలని లేనియెడల సంబంధిత ఆసుపత్రి యొక్క లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ చేసుకోవడం కొరకు కావలసిన ధ్రువ పత్రాలు
1. ఆధార్ కార్డుతో లింక్ ఉన్న మొబైల్.
2. ఆసుపత్రి భవనం ఫోటో.
3. ఆస్పత్రి పేరు యొక్క బోర్డు ఫోటో
4. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
5. ఆస్పత్రి యొక్క అడ్రస్ ప్రూఫ్
లతో సంబంధిత స్పెషల్ డ్రైవ్ కేంద్రాలను సంప్రదించి ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్  చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్, మండల ఆరోగ్య విస్తరణ అధికారి గజగంటి ప్రభాకర్, ఇందిరాల రామకృష్ణ, ఉదయగిరి శ్రీనివాస్, కార్తిక్ తదితులు పాల్గొన్నారు.

తాజావార్తలు