ఆరంభం అదుర్స్
కార్డిఫ్ : చాంపియన్స్ ట్రోఫిలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 26 పరుగుల తేడాతోఘన విజయం సాధించింది. శిఖర్ ధావన్ సెంచరీ, రోహిత్ శర్మ అర్ధ సెంచరీ, చివరలో రవీంద్ర జడేజా దూకుడుతో భారత్ 331 పరుగుల భారీ స్కోరు చేసింది.టాస్ గెలిచి దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది, తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు రోహిత్ శర్మ, ధావన్‌లు శుభారంబాన్నిందించారు. వీరిద్దరు కలిసి వందకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జడేజా బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లో కూడా రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో శర్మ 65, ధావన్ 114, కోహ్లీ 31, ధోనీ 24, రైనా 9, జడేజా 47 పరుగుల చేశారు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో ట్సోట్సోబి రెండు, మెక్లారన్ మూడు, డుమిని ఒక వికెట్ తీశారు. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో దక్షిణాఫ్రికా విఫలమయింది. దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 305 పరుగులు చేసి ఆటవుట్ అయింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తర్వాత పీటర్సన్, డివిలియర్స్ నిలకడగా అడుతూ స్కోరు వేగాన్ని పెంచసాగారు పీటర్సన్ రనౌట్‌తో మ్యాచ్ మలుపు తిరిగింది. 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పీటర్సన రనౌట్‌గా వెనుదిరిగాడు. 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డివిలియర్స్‌ను ఉమేశ్ యాదవ్ అవుట్ చేశాడు. వీరిద్దరి భాగస్వాయ్యం తర్వాత దక్షిణాఫ్రికా వికెట్లు పటపట పడడం ప్రారంభమైంది. ఆఖర్లో మెక్ లారెన్ మెరిసినా అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. మెక్ లారెన్ 71 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇండియా బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, యాదవ్, శర్మ, జడేజా తలో రెండు వికెట్లు సంపాదించారు. గాయం కారణంగా డెల్ స్టేయిన్ అటకు దూరంగా ఉన్నాడు. సెంచరీతో రాణించిన ధావన్‌కు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ లభించింది.
ఇండియా ఇన్నింగ్:- 331(50)
ఆర్‌జి శర్మ- (సి)రాబిన్ పీటర్సన్ (బౌ) ఆర్ మెక్లారన్ 65(81),(4/8,6/1).
యస్ ధావన్- (సి)ఎమ్ ఫాంగిసో (బౌ) జెపి డుమిని 114(94),(4/12,6/1).
వి కోహ్లీ- (సి)హషీమ్ ఆమ్లా (బౌ)లొనొవాటో సొసోబ 31(41),(4/2).
కెడి కార్తిక్- (సి)ఎబి డి విలియర్స్ (బౌ)ఆర్ మెక్లారన్ 14(15),(4/1,6/1).
యమ్‌యస్ ధోని- (సి)యఫ్ డియు ప్లెషెస్ (బౌ)లొనొవాటో సొసోబే 27(26),(4/3).
యస్‌కె రైనా- (సి)జెపి డుమిని (బౌ)ఆర్ మెక్లారన్ 9(6),(6/1).ఆర్‌ఎ జడేజా- నాటౌట్ 47(29),(4/7,6/1).ఆర్ అశ్విన్- రన్ అవుట్(ఆర్ మెక్లారన్) 10(10),(4/1).
భువనెశ్వర్ కుమార్- నాటౌట్ 0(0).
ఎక్స్‌ట్రాలు 14, ఎల్‌బి 4, వైడ్ 8, ఎన్‌బి 2.
మొత్తం: 7 వికెట్లు (331/50).
వికెట్ల పతనం: 1-127(ఆర్‌జి శర్మ, 21.2ఓ), 2-210 (విరాట్ కోహ్లీ, 34.2ఓ), 3-227 (యస్ ధావన్, 37.3ఓ), 4-240 (కెడి కార్తిక్, 39.2ఓ), 5-260 (ఎస్‌కె రైనా, 41.4ఓ), 6-291 (ఎమ్‌యస్ ధోని, 46.2ఓ), 7-323 (ఆర్ అశ్విన్, 49.4ఓ).
సౌత్ ఆఫ్రికా బౌలింగ్:-
మోర్నే మోర్కెల ్6.5 (ప-27,నో-1), లొనొవాటో సొసోబే 10 (ప-83,వి-2,వై-2), ఆర్‌కె లెఇన్వెల్త్ 10 (ప-81, వై-1,నో-1), ఆర్ మెక్లారన్ 10 (ప-70, వి-3, వై-3), రాబిన్ పీటర్సన్ 3.1 (ప-24), జెపి డుమిని 10 (ప-42, వి-1, వై-1).
సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్:- 305(50)
హషీమ్ ఆమ్లా- (సి)యమ్‌యస్ ధోని (బౌ)యుటి యాదవ్ 22(15), (4/4).
కొలిన్ ఇంగ్రామ్- (సి)యస్‌కె రైనా (బౌ)భువనెశ్వర్ కుమార్ 6(5), (4/1).
రాబిన్ పీటర్సన్- (రన్ అవుట్)ఆర్‌ఎ జడేజా, యమ్‌యస్ ధోని 68(72), (4/6).ఎబి డి విలియర్స్- (సి)ఆర్‌ఎ జడేజా, (బౌ)యుటి యాదవ్ 78(71), (4/7).జెపి డుమిని- (ఎల్ బిడబ్ల్యు)ఆర్‌ఎ జడేజా, 14(24).యఫ్ డియు ఫ్లెషెస్- (సి)యస్‌కె రైనా (బౌ) ఐ శర్మ 30(23), (4/5).
డిఎ మిల్లెర్- (రన్ అవుట్)ఐ శర్మ,యస్‌కె రైనా.
ఆర్ మెక్లారన్- నాటౌట్ 71(61), (4/11,6/1).
ఆర్‌కె లెఇన్వెల్ద్త్- (సి)యమ్‌యస్ ధోని (బౌ)ఐ శర్మ 4(5),
లొనొవాటో సొసోబే (బౌ)ఆర్‌ఎ జడేజా, 3(14).
మోర్నే మోర్కెల్ (బౌ) భువనెశ్వర్ కుమార్, 8(11), (4/1).
ఎక్స్‌ట్రాలు 9 ఎల్‌బి 1, వై 7, ఎన్‌బి 1.
మొత్తం: 305
వికెట్ల పతనం:
1-13(సిఎ ఇన్‌గ్రామ్, 2.1ఓ), 2-31 (హెచ్ ఆమ్లా, 3.5ఓ), 3-155 (ఆర్‌జె పీటర్‌సన్, 24.3ఓ), 4-182 (జెపి డుమిని, 30.4ఓ), 5-184 (ఎబి డి విలెర్స్, 31.4ఓ), 6-188 (డిఎ మిల్లెర్, 32.5ఓ), 7-238 (ఎఫ్ డు ఫ్లెషిస్, 37.3ఓ) 8-251 (ఆర్‌కె క్లెవిన్‌వెల్ద్ల్, 39.5ఓ), 9-257 (ఎల్ ఎల్ సొసోబే, 42.5ఓ), 10-305 (ఎమ్ మొర్కెల్, 49.6ఓ).
ఇండియా బౌలింగ్:-
భువెనెశ్వర్ కుమార్ 7 (ప-49, వి-2, నో-1), యాదవ్ 10 (ప`75, వి-2, వై-2), ఐ శర్మ 8 (ప`66, వి-2, వై-2), అశ్విన్ 10 (ప-47, వై-2), జడేజా 9 (మే-1, ప-31, వి-2), రైనా 6 (ప-36, వై-1).